యాప్నగరం

18వ పుట్టినరోజు జరుపుకుంటున్న గూగుల్

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ 18వ ఏట అడుగుపెట్టింది.

TNN 27 Sep 2016, 12:26 pm
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ 18వ ఏట అడుగుపెట్టింది. మంగళవారం తన 18వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా వెబ్ బ్రౌజర్లలో గూగుల్ డూడుల్‌ ప్రత్యక్షమవుతోంది.
Samayam Telugu google celebrates 18th birthday
18వ పుట్టినరోజు జరుపుకుంటున్న గూగుల్

1998లో అమెరికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు లారీ పేజ్, సెర్గే బ్రిన్ గూగుల్‌ సంస్థను స్థాంపిచారు. దీన్ని సెప్టెంబర్ 27న స్థాపించినట్లు గూగుల్ హోం పేజీలో మనకు కనిపిస్తుంది. అయితే 2006 నుంచి సెప్టెంబర్ 27న గూగుల్ తన పుట్టినరోజును జరుపుకుంటోంది. కానీ అంతకు ముందు దీని పుట్టిన రోజును సెప్టెంబర్ 26న నిర్వహించారు.

2004లో అయితే వీటిని విరుద్దంగా సెప్టెంబర్ 7న 6వ పుట్టిన రోజు డూడుల్ గూగుల్ పేజీలో దర్శనమిచ్చింది. అంతకు ముందు సంవత్సరం సెప్టెంబర్ 8 గూగుల్ బర్త్‌డే డూడుల్ కనింపించింది. దీన్ని బట్టి గూగుల్ సంస్థకు కూడా తన పుట్టిన రోజు కచ్చితంగా తెలియనట్లుంది. గూగుల్ 2002 నుంచి తన బర్త్‌డే‌ను డూడుల్‌‌తో జరుపుకుంటోంది. అయితే సంస్థ మొదటి డూడుల్‌ను మాత్రం ‘బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్’ పేరుతో 1998లో మొదలుపెట్టింది.
పేజ్, బ్రిన్‌లు స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు వారికి సెర్చ్ ఇంజిన్ ఆలోచన వచ్చింది. ఈ మేరకు 1996లో రీసెర్చ్ ప్రాజెక్టును మొదలుపెట్టారు. 1998 నుంచి గూగుల్ పేరుతో దీన్ని ఆచరణలోనికి తెచ్చారు. ఆ తరవాత ఇది ఎలాంటి టెక్నాలజీ విప్లవాన్ని సృష్టించిందో మీకు తెలిసిందే.

Google is celebrating its 18th birthday on Tuesday with an animated Doodle shown to web browsers around the world. The company, founded by Larry Page and Sergey Brin in 1998, traditionally marks its birthday on the Google homepage on September 27.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.