యాప్నగరం

చెన్నై బాలుడికి గూగుల్ అవార్డు

చెన్నైకి చెందిన పద్నాలుగేళ్ల అద్వయ్ రమేశ్ ప్రతిష్టాత్మక గూగుల్ అవార్డును సాధించాడు.

TNN 20 Jul 2016, 4:02 pm
తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన పద్నాలుగేళ్ల అద్వయ్ రమేశ్ ప్రతిష్టాత్మక గూగుల్ అవార్డును సాధించాడు. అతను తయారుచేసిన పరికరానికి గూగుల్ కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డు లభించింది. మత్స్యకారుల కోసం అద్వయ్ ‘ఫిషర్ మెన్ లైఫ్ లైన్ టెర్మినల్’ అనే పరికరాన్ని తయారుచేశాడు. ఈ పరికరం జీపీఎస్ సాయంతో పనిచేస్తుంది. ఈ పరికరానికిగాను అద్వయ్ ఆసియా విభాగంలో అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద 50వేల డాలర్లు అంటే రూ. 33 లక్షల 57 వేల స్కాలర్‌షిప్‌ను గూగుల్ అందజేస్తుంది. ఆసియా విభాగంలో అద్వయ్ తో పాటూ వివిధ దేశాల నుంచి 20 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. చివరికి అద్వయ్ రూపొందించిన పరికరం ఎంపికైంది.
Samayam Telugu google community impact award 14 year old advay ramesh is asia winner
చెన్నై బాలుడికి గూగుల్ అవార్డు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.