యాప్నగరం

గర్భిణికి నరకం: గర్భస్థ శిశువుకు గాట్లు..మృతి

ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే కళ్లు తెరిచి లోకాన్ని చూడాల్సిన పసికందు కన్నుమూసి కానరాని లోకానికి వెళ్లిపోయింది

Samayam Telugu 11 May 2017, 2:42 pm
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే కళ్లు తెరిచి లోకాన్ని చూడాల్సిన పసికందు కన్నుమూసి కానరాని లోకానికి వెళ్లిపోయింది. ఆ పసికందు తల్లి పరిస్థితి విషమంగా మారింది. సర్కారు దవాఖానాల్లోనే గర్భిణులు పురుడు పోసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే.. పురుడు కోసం వచ్చిన గర్భిణి స్త్రీలకు వైద్యులు నరకం చూపిస్తున్నారు.
Samayam Telugu govt doctors had surgery for pregnant lady foetus gets stitches dies in telangana
గర్భిణికి నరకం: గర్భస్థ శిశువుకు గాట్లు..మృతి


మంచిర్యాల జిల్లా బొమ్మనపల్లికి చెందిన బట్టు పద్మ అనే మహిళకు మంగళవారం పురిటినొప్పులు రావడంతో భర్త ఆమెను దగ్గర్లోని వేమనపల్లిలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించాడు. అక్కడి వైద్యులు పద్మకు బాగానే ఉందని సుఖ ప్రసవం కోసం చెన్నూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్లాకే వైద్యులు ఏం పరీక్షలు చేశారో కానీ.. కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి బాగాలేదని.. మంచిర్యాల ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు. అప్పటికే మధ్యాహ్నాం 2.30 దాటిపోయింది.

భర్త పద్మను తీసుకొని సాయంత్రం 6గంటలకు మంచిర్యాల ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ గర్భిణి పద్మకు మళ్లీ ఏవో పరీక్షలు చేసి ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ సక్సెస్ కాకపోవడంతో కంగారుపడ్డ వైద్యులు కరీంనగర్ ఆసుపత్రికి పంపించారు. పద్మ కరీంనగర్ చేరుకోగానే చీకటి పడింది. మరుసటి రోజు, బుధవారం, ఆపరేషన్ నిర్వహించి.. పద్మకు మృత శిశువును చేతిలో పెట్టారు. ఆ మృత పసికందు తల, చేతులు, ఇతర చోట్ల కత్తిగాట్లున్నాయి.

దీంతో మంచిర్యాలలో వైద్యులు చేసిన ఆపరేషన్ తో శిశువు తలకు గాయమైందని, కరీంనగర్ ఆసుపత్రి వైద్యులు సైతం రక్తస్రావంతో ఉన్న మహిళకు మరునాడు ఆపరేషన్ నిర్వహించారని ఆమె భర్త, బంధులు ఆందోళనకు దిగారు.

వైద్యాధికారులు మాత్రం శస్త్రచికిత్స చేయకముందే కడుపులోనే పాప మృతి చెందిందని చెబుతున్నారు. పద్మకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.