యాప్నగరం

పెళ్లి కోసం.. కన్నతల్లినే హత్య చేశాడు!?

భావి భారత పౌరులను సన్మార్గంలో నడిపించాల్సిన వ్యక్తే.. కన్నతల్లిని హత్య చేశాడు.

TNN 4 May 2017, 5:26 pm
అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాల్సిన ఉపాధ్యాయుడే ఘోరానికి తెగబడ్డాడు. భావి భారత పౌరులను సన్మార్గంలో నడిపించాల్సిన వ్యక్తే.. కన్నతల్లిని హత్య చేశాడు. మొదటి భార్యతో విభేదాల వల్ల రెండో పెళ్లి చేసుకుందామనుకున్న ఆ ప్రబుద్ధుడు.. అందుకు తన తల్లి అంగీకరించకపోవడంతో ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. తంజావూరులో ఓ గవర్నమెంట్ స్కూల్ హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్న కె. త్యాగరాజన్‌ (57) తన తల్లిని ఎవరో దారుణంగా హత్య చేశారని ఏప్రిల్ 20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలు చోరీకి గురవడంతో.. ఇది దొంగల పనే అయుంటుందని అతడు పోలీసుల దగ్గర వాపోయాడు.
Samayam Telugu govt school headmaster kills his mother in thanjavur
పెళ్లి కోసం.. కన్నతల్లినే హత్య చేశాడు!?


కేసు విచారిస్తున్న పోలీసులకు.. చోరీకి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరక్క పోవడంతో మరో కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. త్యాగరాజన్‌ ప్రవర్తనతో అనుమానం వచ్చిన పోలీసులు మే 2న అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అతడు అసలు విషయం బయటపెట్టాడు. రెండో పెళ్లికి అంగీకరించకపోవడంతో తల్లిని తానే హత్య చేసినట్లు అతడు అంగీకరించాడు.

మొదటి భార్యతో తరచూ గొడవలు అవుతుండటం వల్ల ప్రస్తుతం త్యాగరాజన్ విడిగా ఉంటున్నాడు. కొద్ది కాలంగా అతడు రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. దానికి అతడి తల్లి తిరస్కరిస్తుండంతో ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. గత నెల 20న అతడు.. వృద్ధురాలని కూడా చూడకుండా కన్నతల్లినే హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ఒంటిపై కారం చల్లి, ఆభరణాలను అపహరించాడు. ఆపై ఎవరో తన తల్లిని హత్య చేసి, నగలు చోరీ చేశారని అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.