యాప్నగరం

3 పెళ్లిళ్లు, మరో ఇద్దరితో అక్రమ సంబంధం నెరపి...

కట్టుకున్న వాడిని కాదునుకుని రెండో పెళ్లి చేసుకుంది. అతడిని కూడా వదిలేసి మరో వివాహితుడిని మూడో పెళ్లి చేసుకుంది. అతడితోనూ కుదురుగా ఉండక మరో ఇద్దరి యువకులతో అక్రమ సంబంధం.

TNN 19 Jun 2017, 11:16 am
మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే కాదు మరో ఇద్దరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఓ మహిళను వారంతా వదిలించుకోవడంతో తీవ్ర వేదనకు గురైంది. దీంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడంతో గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్చించారు. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాత గుంటూరు మణి హోటల్‌ ప్రాంతానికి చెందిన దేవదాస్‌ దంపతుల కుమార్తె 27 ఏళ్ల మహితకు 12 ఏళ్ల కిందట శేఖర్‌ అనే యువకుడితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే పాప పుట్టిన రెండేళ్ల తర్వాత శేఖర్‌ను వదిలేసి అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడిని వివాహం మహిత చేసుకుంది. మరో రెండేళ్లకు అతడిని కూడా వదిలేసి కొరిటెపాడుకు చెందిన శ్రీమన్నారాయణ అనే వివాహితుడిని మూడో పెళ్లి చేసుకుంది.
Samayam Telugu guntur women get three marriages with diffrent people and illegal affairs
3 పెళ్లిళ్లు, మరో ఇద్దరితో అక్రమ సంబంధం నెరపి...


అతడితో కాపురం చేస్తూనే మరో ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమెను వదిలేశాడు. ఏడాది కిందట ఆ ఇద్దరు యువకులు కూడా ఆమెతో సంబంధాలు తెంచుకున్నారు. దీంతో శ్రీమన్నారాయణ దగ్గరకు వెళ్లిన మహిత డబ్బులివ్వాలని డిమాండ్ చేసింది. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో తనతో కలిసి దిగిన ఫోటోలను బయటపెడతానంటూ బెదిరించింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను పిలిచి కౌన్సలింగ్ ఇచ్చి పంపించారు.

దీంతో ఆగ్రహానికి గురైన ఆమె మీ అందరి అంతు చూస్తానని బెదిరించి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు రోడ్డులో ఆదివారం ఉదయం ఒక చేతిలో పురుగుల మందు, మరో చేతిలో కూల్‌ డ్రింక్‌ సీసా పట్టుకుని కూర్చుంది. దీనిని గమనించిన స్థానికులు 108 కు సమాచారం అందించారు. అంతలోనే మహిత పురుగుల మందు తాగింది. ఆ సమయానికి చేరుకున్న 108 సిబ్బంది ఆమెకు ప్రాధమిక చికిత్స చేసి, గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె బంధువులకు సమాచారం చేరవేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.