యాప్నగరం

ఆ పరిహారం ప్రజాప్రతినిధులే భరించాలి

వివాదాస్పదమైన జాట్ రిజర్వేషన్ల ఆందోళన కారణంగా నష్టపోయిన వారికి ప్రజాప్రతినిధులే నష్టపరిహారం చెల్లించాలి.

TNN 22 Jun 2016, 8:57 pm
దేశంలో ఇటీవల అగ్ర కులాలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లు ఎంతగా ప్రజలను నష్టపరుస్తున్నాయో అందరికి తెలిసిందే. తాజాగా, ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్లు కోరుతూ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ను దగ్దం చేసారు. అలాగే ఉత్తర భారతదేశంలో కూడా జాట్ల సామాజిక వర్గం రిజర్వేషన్లు కోరుతూ హర్యానాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలు శృతి మించడంతో అక్కడ వందల కోట్ల రూపాయిల విలువైన ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఇలా ఎవరికి వారు తమ స్వార్థం కోసం ఈ తరహా ఆందోళనలకు దిగి ఆస్తులను ధ్వంసం చేస్తుండటం చూసిన ఒక వ్యక్తికి ఆగ్రహం తన్నుకువచ్చింది. దీనంతటికి కారణం ప్రజా ప్రతినిధులేననే నిర్ణయానికి వచ్చాడు. వారు సరిగా లేకనే ఈ తరహా విధ్వంసాలు చోటుచేసుకుంటున్నందున ఈ యావత్ నష్టానికి బాధ్యత కూడా వారే భరించాలని ఆదేశాలివ్వాలంటూ హర్యానాలోని రివారీ అనే స్థానిక కోర్టుకెక్కాడు. నష్టపోయిన ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తికి నష్టపరిహారంగా హర్యానాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.340 కోట్లను చెల్లించాలని అతను తన పిటీషనులో పేర్కొన్నాడు. ఆ రాష్ట్రంలో 90 ఎమ్మెల్యేలు, 10మంది ఎంపీలున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన నేతలు తమ స్వార్థం కోసం ఈ తరహా అమానుషకాండలకు తెరవెనక నుండి అండదండలందిస్తున్నారని అతను ఆగ్రహం వ్యక్తం చేసాడు. నేతలను దారికి తేవాలంటే ఈ తరహా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కోర్టును కోరాడు. ప్రస్తుతం కోర్టులో కేసు విచారణలో ఉంది. దీనిపై కోర్టు ఏమని స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
Samayam Telugu haryana mps mlas may have to pay rs 340 crore each for jat stir damages
ఆ పరిహారం ప్రజాప్రతినిధులే భరించాలి


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.