యాప్నగరం

వైరల్‌గా మారిన కానిస్టేబుల్ విషాదాంతం

పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి విఫల యత్నం చేసి, ఆ తర్వాత మరణించిన ఓ హెడ్ కానిస్టేబుల్‌కు సంబంధించిన సీపీటీవీ ఫుటేజీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

TNN 28 Mar 2017, 1:18 pm
పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి విఫల యత్నం చేసి, ఆ తర్వాత మరణించిన ఓ హెడ్ కానిస్టేబుల్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. కేరళ వాస్తవ్యుడైన ప్రవీణ్ అనే వ్యక్తి (40 ఏళ్లు).. పోలీస్ డిపార్ట్‌మెంట్లో 18 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం అతడు కర్ణాటకలో మంగళూరు సిటీ పోలీస్ విభాగం పరిధిలోని బజ్పే పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతడు స్టేషన్‌కు సమీపంలోనే.. ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.
Samayam Telugu head constables fatal escape bid video goes viral
వైరల్‌గా మారిన కానిస్టేబుల్ విషాదాంతం


ప్రవీణ్.. ఒక రోజు తన పక్కింట్లో పదకొండేళ్ల బాలిక స్నానం చేస్తుండగా అక్రమంగా వీడియో తీశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతే కాకుండా మరుసటి రోజు ఆ బాలిక తల్లి స్నానం చేస్తుండగా అలాగే చేశాడట. దీన్ని గుర్తించిన ఆ మహిళ.. అతణ్ని రెడ్ హ్యాండె‌డ్‌గా పట్టుకుంది. అతడు పని చేసే పోలీస్ స్టేషన్లోనే కేసు పెట్టింది. వెంటనే అతణ్ని విధుల్లోంచి సస్పెండ్ చేశారు. ‘పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POCSO)’ కింద కేసుపెట్టి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మార్చి 25న ప్రవీణ్‌ను కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళుతుండగా.. అతడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా అతడు.. కోర్టు బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకేశాడు. రెండో ఫ్లోర్‌పై పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే అతణ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మరణించాడు.

లిఫ్టు నాలుగో ఫ్లోర్‌లో ఆగీఆగడంతోనే కానిస్టేబుల్ ప్రవీణ్.. ఒక్కసారిగా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకొని, బిల్డింగ్ రెయిలింగ్ దిశగా పరుగెత్తాడు. వాటి పైకెక్కి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి కిందకి దూకేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కోర్టు బిల్డింగ్ ప్రాంగణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వీటిని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.