తోటి వ్యక్తి ప్రాణాపాయంలో ఉంటే వీడియోలు తీసుకుని ఆనందిస్తున్న రోజులివి. అలాంటిది ఓ వ్యక్తి తనకు ఏమాత్రం పరిచయంలేని ఓ చిన్నారి ప్రమాదంలో చిక్కుకుంటే.. ఆమెను కాపాడేందుకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. తనకు గాయాలవుతాయని తెలిసినా ధైర్యంగా ముందుకెళ్లి.. ఆ చిన్నారిని పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కించాడు.
చైనాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అదుపుతప్పిన ఓ వాహనం ఫుట్పాత్కు దూసుకొచ్చింది. అది ఓ చిన్నారిని ఢీకొట్టడమే కాకుండా, ఆమెను లాక్కెళ్లింది. ఇది గమనించిన ఓ వ్యక్తి వేగంగా వస్తున్న ఆ వాహనాన్ని అడ్డుకున్నాడు. దీంతో ఆ వాహనానికి చిక్కుకున్న ఆ చిన్నారి పక్కకు పడిపోయింది. అయితే, ఆమెకు పెద్దగా గాయాలు కాలేదు. ఆ వ్యక్తికి మాత్రం అక్కడక్కడా గాయాలయ్యాయి. లేకపోతే.. ఆ వాహనం ఫుట్పాత్ దాటి హైవే మీదకు దూసుకెళ్లేది. అటువైపు వేగంగా వచ్చే వాహనాలు ఆ చిన్నారి ఢీకొనేవి. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డయ్యాయి.
ఆ వీడియోను ఇక్కడ చూడండి.