యాప్నగరం

రేపిస్టు బాబాకు తన భార్యంటే బొత్తిగా ఇష్టం లేదా?

ఇద్దరు సాధ్వీలను అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ రామ్ రహీం సింగ్ జైలు పాలైన విషయం తెలిసిందే. ఈ రేపిస్టు బాబాకు తన భార్య మొహం చూడటం బొత్తిగా ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. తాజాగా అతడు ములాఖత్ కోసం రాసిచ్చిన జాబితా ఇదే విషయాన్ని..

TNN 5 Sep 2017, 4:30 pm
ఇద్దరు సాధ్వీలను అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ రామ్ రహీం సింగ్ జైలు పాలైన విషయం తెలిసిందే. ఈ రేపిస్టు బాబాకు తన భార్య మొహం చూడటం బొత్తిగా ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. తాజాగా అతడు ములాఖత్ కోసం రాసిచ్చిన జాబితా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. జైల్లో సాధారణ సందర్శనకు అనుమతించే 10 మంది పేర్లతో కూడిన జాబితాలో.. గుర్మీత్ తన భార్య హర్జీత్ పేరు చేర్చలేదు.
Samayam Telugu honeypreet insan not wife on gurmeet ram rahims list of jail visitors
రేపిస్టు బాబాకు తన భార్యంటే బొత్తిగా ఇష్టం లేదా?


జైలు అధికారులు ప్రత్యేక సమయాల్లో ఖైదీలను కలవడానికి వారి కుటుంబసభ్యులు, బంధువులకు అనుమతిస్తారు. ఇందులో భాగంగా ప్రతి ఖైదీని కలిసేవారి వివరాలతో కూడిన జాబితాలను సిద్ధం చేస్తారు. గుర్మీత్ జైలు శిక్ష అనుభవిస్తున్న సునేరియా కారాగార అధికారులు కూడా ఇదేవిధంగా అతణ్ని పేర్లు రాసిమ్మని అడిగారు.

సదరు జాబితాలో గుర్మీత్.. తన తల్లి నసీబ్ కౌర్, కుమారుడు జస్మీత్ ఇన్సాన్, కోడలు హసన్‌ప్రీత్ ఇన్సాన్, కుమార్తెలు అమర్‌ప్రీత్, చరణ్‌ప్రీత్, అల్లుళ్లు షాన్-ఇ-మీత్, రూ-ఇ-మీత్, డేరా మేనేజ్‌మెంట్ ఛైర్‌పర్సన్ విపాసనతో పాటు బాబా దత్త పుత్రికగా పేర్కొనే హనీప్రీత్ ఇన్సాన్, దాన్ సింగ్ పేర్లు రాసిచ్చాడు. ఇందులో అతడి భార్య పేరు లేకపోవడం విస్మయం కలిగించే అంశం.

మరోవైపు గుర్మీత్ ఇచ్చిన జాబితాలో ఉన్నవారు ఇప్పట్లో అతణ్ని కలిసే సాహసం చేసే అవకాశాలు కనిపించడంలేదు. హనీప్రీత్‌తో పాటు బాబా కుటుంబసభ్యులందరిపై పోలీసులు ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారు డేరా విడిచి ఎక్కడికో పారిపోయినట్లు సమాచారం. వారి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.