యాప్నగరం

నేరమేదైనా వీరు తలచుకుంటే బెయిల్ పక్కా కానీ...

కరుడగట్టిన నేరస్థులకు, దోపీడి దొంగలకు, అత్యాచారాలకు పాల్పడేవారికి బెయిల్ ఏర్పాట్లు చేసి, కేసు తీవ్రతను బట్టి డబ్బులు వసూలు చేయడమే వీరి వృత్తి .

TNN 14 Feb 2017, 12:58 pm
కరుడగట్టిన నేరస్థులకు, దోపీడి దొంగలకు, అత్యాచారాలకు పాల్పడేవారికి బెయిల్ ఏర్పాట్లు చేసి, కేసు తీవ్రతను బట్టి డబ్బులు వసూలు చేయడమే వీరి వృత్తి . నేరస్థులు ఏవరో తెలియకపోయినా వారికి తమ సొంత పూచీకత్తులతో బెయిల్ వచ్చేలా చేస్తారు. ముంబయి, పుణే జైళ్లలోని నేరస్థులకు పూచీకత్తులతో బెయిల్ ఇప్పించే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu how two witnesses for hire set 50 accused free
నేరమేదైనా వీరు తలచుకుంటే బెయిల్ పక్కా కానీ...


గతంలో బస్సు కండక్టర్‌గా విధులు నిర్వహించిన రామచంద్ర చిన్నపా పవార్, శ్రీరామ్ బిందా అనే ఇద్దరు వ్యక్తులు ముంబయి, థానే, పుణే, నవీ ముంబయికి చెందిన సుమారు 50 మంది నేరస్థులకు తమ పూచీకత్తులతో బెయిల్ ఇప్పించినట్లు పోలీసులు గుర్తించారు. చెయిన్ స్నాచింగ్ కేసుకు రూ.2,000, హత్య కేసుకు రూ.10,000 వసూలు చేస్తారు. వీరు బెయిల్ ఏర్పాట్లు చేసివారిలో కరుడగట్టిన నేరస్థులు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది.

గతంలో థానే క్రైమ్ బ్రాంచ్ అధికారులు జాధవ్ అనే నేరస్థుడిని దోపిడీ కేసులో అరెస్ట్ చేశారు. జాదవ్ కార్యకలాపాల గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకోవడంతో వారిపై దాడి చేసి తప్పించుకోడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. దోపిడీ పాల్పడిందే కాకుండా తమపై దాడి చేయడంతో బెయిల్ వచ్చే అవకాశం లేదంటూ పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా జాదవ్ భయంకరమై నేరస్థుడని, అతడికి బెయిల్ మంజూరు చేస్తే ప్రమాదికారిగా మారతాడంటూ కోర్టుకు తెలియజేశారు. అయినా సరే అతడికి బెయిల్ రావడంతో పోలీసులే ఖంగుతిన్నారు. ఈయన ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్లు చాలా మందికి బెయిల్ ఏర్పాట్లు చేస్తుంటారు. దొంగ పాస్‌పోర్ట్, నకిలీ వీసా కేసుల్లో అరెస్టైన వారికి కూడా ఈ నిందితులు బెయిల్ ఇప్పించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.