యాప్నగరం

బాయ్‌ఫ్రెండ్ కోసం ఓ యువతి ఏం చేసిందంటే..

కష్టాల్లో ఉన్న బాయ్‌ఫ్రెండ్ కోసం ఓ యువతి ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయాలు పెంచుకుంది. ఆ తర్వాత..

TNN 25 Dec 2016, 4:12 pm
ప్రేమించిన యువతి కోసం ఆర్థిక సాయం చేసే అబ్బాయిలను చూశాం. ప్రియురాలికి సొమ్ము అవసరం పడితే సొంతిట్లోనే దొంగతనం చేసిన సినిమా హీరోలనూ చూశాం. కానీ కాలం మారింది కదా. అమ్మాయిలు కూడా బాగానే డెవలప్ అయ్యారు. కష్టాల్లో ఉన్న ప్రియుణ్ని ఆదుకునేందుకు తమ వంతు ‘సాయం’ చేస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌ను ఆదుకోవడం కోసం ఇంజనీరింగ్ చదువుతున్న ఓ యువతి ఫేస్‌బుక్ ద్వారా పరిచయాలు పెంచుకుంది. వారితో మాటామంతీ కలిపి ఇళ్లకు వెళ్లేది, తర్వాత ఏం చేసింది?
Samayam Telugu hyderabad girl doing robberies for boyfriend caught by police
బాయ్‌ఫ్రెండ్ కోసం ఓ యువతి ఏం చేసిందంటే..


హైదరాబాద్‌కు చెందిన కిరణ్మయి అనే 19 ఏళ్ల యువతి ఇంజినీరింగ్ చదువుతోంది. ఆమెకు యశ్వంత్ అనే ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బంగారు ఆభరణాల దొంగతనం కేసులో వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకూ ఆ అమ్మాయి దొంగతనం చేసింది తన స్నేహితురాలి ఇంట్లో కావడం గమనార్హం. ఇంజనీరింగ్ చదువుకుంటున్నావ్ కదా.. ఇలా దొంగతనం ఎందుకు చేశావ్ అని ప్రశ్నించిన పోలీసులకు ఆమె చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. నా బాయ్‌ఫ్రెండ్ యశ్వంత్‌ జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఆర్థిక ఇబ్బందులున్నాయి. వాటిని తీర్చడానికే దొంగతనాలు చేస్తున్నా అని చెప్పింది. పరిచయాలు పెంచుకోవడం కోసం సదరు యువతి ఓ ఫేస్‌బుక్ పేజీని రూపొందించింది. ఆ అకౌంట్ నుంచి మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి.. చాటింగ్ ద్వారా పరిచయాలు పెంచుకునేది. అలా అలా వారి ఇళ్లకు వెళ్లి నమ్మకస్తురాలిగా మారిపోయేది. అదును చూసుకొని విలువైన ఆభరణాలు కొట్టేసేది.

సీన్ కట్ చేస్తే.. గత నవంబర్లో 15 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని కిరణ్మయి ఫ్రెండ్ ఒకరు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎవరూ, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ ఎందుకు, ఎలా అని లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిరణ్మయిని అరెస్టు చేశారు. తమ స్టయిల్లో అడిగేసరికి వివరాలు బయటపెట్టింది. దీంతో ఆమెపై నాలుగు దొంగతనం కేసులు నమోదు చేసి.. ఆమెతోపాటు, బాయ్ ఫ్రెండ్‌ను కూడా రిమాండ్‌కు తరలించారు. ప్రేమించడాన్ని తప్పుబట్టలేం కానీ, ప్రియుడి కష్టాలను తొలగించాలని ప్రయత్నించి ఇలా దొంగతనాలు చేయడమే తప్పు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.