యాప్నగరం

ఆటోవాలా సాయం.. సలాం చెబుదాం ఇలా!

అడిగితే చేసే సాయం కంటే.. అడగకుండా చేసే సాయం ఎంతో గొప్పది. ఎదుటి వ్యక్తి సమస్య తెలుసుకుని, అండగా నిలిచేవారు ఈ రోజుల్లో చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఆటో నడుపుకుంటూ జీవితాన్ని వెళ్లదీసే ఆటోవాలా...

TNN 18 Apr 2017, 1:48 pm
Samayam Telugu hyderabadi autowala helped a girl
ఆటోవాలా సాయం.. సలాం చెబుదాం ఇలా!
డిగితే చేసే సాయం కంటే.. అడగకుండా చేసే సాయం ఎంతో గొప్పది. ఎదుటి వ్యక్తి సమస్య తెలుసుకుని, అండగా నిలిచేవారు ఈ రోజుల్లో చాలా తక్కువ. అయితే, ఆటో నడుపుతూ జీవితాన్ని వెళ్లదీసే ఆటోవాలా... ఓ అమ్మాయికి అత్యవసర సమయంలో సాయం చేసి ఆదుకున్నాడు. అందుకు బదులుగా ఆమె తన ఫేస్‌బుక్‌లో అతనికి ధన్యవాదాలు తెలుపుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ ఆటోవాలా మరెవరో కాదు.. హైదరాబాద్‌కు చెందిన బాబా.

రిజశ్రీ వేణుగోపాల్ అనే యువతి వీసా ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చింది. అయితే, ఆమె రూ.5వేలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.2వేలు మాత్రమే ఉంది. దీంతో, ఆమె బాబా ఆటో ఎక్కి హైదరాబాద్‌లో సుమారు 10 నుంచి 15 ఏటీఎంలకు వెళ్లింది. ఏదీ పనిచేకపోవడంతో.. చాలా దిగులు చెందింది. కొన్ని దుకాణాల్లోకి వెళ్లి తన కార్డు స్వైప్ చేసుకుని రూ.3వేలు ఇవ్వాలని కోరింది. అందుకు ఎవ్వరూ ఒప్పుకోలేదు.

మె బాధ అర్థం చేసుకున్న బాబా... తన దగ్గర రూ.3వేలు ఉన్నాయని, అవి తీసుకుని చెల్లించండి అని చెప్పాడు. ఆ క్షణంలో ఆమెకు బాబా... దేవుడిలా కనిపించాడు. అతని సాయానికి ఆమెకు చెప్పలేనంత సంతోషం కలిగింది. వెంటనే ఆమె.. బాబాతో ఓ సెల్ఫీ తీసుకుని, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఆ పోస్టును 6,093 మంది షేర్ చేసుకున్నారు. బాబాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి, ఈ విషెష్‌ను బాబా వరకు చేర్చేందుకు ఆమె పోస్టును షేర్ చేసుకుందామా...


వరిజశ్రీ facebook post link

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.