యాప్నగరం

కూతురిని గవర్నమెంట్ స్కూల్లో చేర్చిన ఐఏఎస్!

కూలి పనులు చేసుకునే వాళ్లు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడానికి ఇష్టపడటం

TNN 19 Jul 2017, 9:28 am
కూలి పనులు చేసుకునే వాళ్లు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడానికి ఇష్టపడటం లేదు. గవర్నమెంటు స్కూల్స్ లో విద్యా ప్రమాణాలు దారుణంగా తయారు కావడంతో.. పిల్లల్ని బాగా చదివించాలి అనే తపన ఉన్న వాళ్లంతా ప్రైవేట్ స్కూల్స్ వైపే చూస్తున్నారు. ఆర్థిక స్తోమత లేకపోయినా, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి అయినా.. పిల్లల్ని మాత్రం ఫీజులు కట్టి చదివించుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లుగా పనిచేసే వాళ్లు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో జాయిన్ చేయడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై టీచర్లకే నమ్మకం లేదు.
Samayam Telugu ias officer enrols kid in corporation school
కూతురిని గవర్నమెంట్ స్కూల్లో చేర్చిన ఐఏఎస్!


మరి ప్రభుత్వ స్కూల్ ను ఎవ్వరూ పట్టించుకోని తరుణంలో ఒక ఐఏఎస్ అధికారిణి తన కూతురిని గవర్నమెంటు స్కూల్లో చేర్చి వార్తల్లోకి వచ్చారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లో రెవెన్యూ శాఖ సహాయ కమిషనర్ అయిన ఆర్.లలిత తన కూతురిని చెన్నై కార్పొరేషన్ స్కూల్లో చేర్చారు. చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్లలో ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని, అందుకే తన కూతురిని కార్పొరేషన్ స్కూల్లోనే చేర్చానని లలిత తెలిపారు.

లలిత కూతురి పేరు తరుణిక. వయసు రెండున్నర సంవత్సరాలు. ఎల్‌కేజీలో చేరింది. కార్పొరేషన్ స్కూల్లోనే చదివి తన కూతురు ఉన్నత విద్యావంతురాలు అవుతుందని లలిత విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడ విశ్వాసం కేవలం కూతురి మీదే కాదు, కార్పొరేషన్ స్కూల్ మీద కూడా. మరి కూతుర్ని ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివించే స్తోమత ఉన్నప్పటికీ కార్పొరేషన్ స్కూల్ లో చేర్చిన లలితను ప్రభుత్వాధికారులు ఆదర్శంగా తీసుకోవాలి.

టీచర్లు, ప్రభుత్వోద్యుగులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించడం మొదలుపెడితే, వాటిల్లో ప్రమాణాలు కచ్చితంగా మెరుగుపడతాయి. లేకపోతే అన్ని వర్గాల నమ్మకం కోల్పోయి.. ప్రభుత్వ పాఠశాలలూ ఎవరికీ పట్టకుండా పోతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.