యాప్నగరం

ట్రూకాలర్‌తో ఆన్‌లైన్ చెల్లింపులు కూడా...!

ఇప్పుడు ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లోను ట్రూకాలర్ యాప్ కనిపిస్తోంది.

TNN 6 Apr 2017, 1:55 pm
ఇప్పుడు ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లోను ట్రూకాలర్ యాప్ కనిపిస్తోంది. ఎవరు? ఎక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారో చెప్పే... ట్రూకాలర్ చెప్పేస్తుంది. ఇప్పుడు ఆ యాప్ కి కొత్త హంగులు జత చేరాయి. మారుతున్న భారతావనికి అనుగుణంగా ట్రూకాలర్ కూడా తన సర్వీసులను మార్చుకుంది. డిజిటల్ చెల్లింపులకు అనుగుణంగా ట్రూ కాలర్ రూపొందింది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి ట్రూకాలర్ పే పేరుతో కొత్త సర్వీసును ప్రారంభించింది. దీని ద్వారా మొబైల్ రీచార్జులు చేసుకోవచ్చు. ట్రూకాలర్ పే ఓపెన్ చేయగానే ‘సెండ్ మనీ త్రో యూపీఐ’ (Send money through UPI) అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే ఎవరికీ డబ్బులు పంపించాలనుకుంటున్నారో వారి యూపీఐ ఐడీ, మొబైల్ నెంబర్ అడుగుతుంది. వాటిని ఎంటర్ చేసి ఎమౌంట్ కూడా వేసి ‘పే’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత యూపీఐ పిన్ అడుగుతుంది. అది కూడా ఎంటర్ చేసి ఓకే చేస్తే సరి.
Samayam Telugu icici bank partners truecaller for upi based mobile payment solution
ట్రూకాలర్‌తో ఆన్‌లైన్ చెల్లింపులు కూడా...!


ట్రూకాలర్ లో వీడియో కాల్స్ కూడా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీని కోసం గూగుల్ వీడియో కాలింగ్ యాప్ అయిన డ్యుయోతో కలసి ట్రూకాలర్ పనిచేస్తోంది. అలాగే నెట్ లేకున్నా కూడా ట్రూకాలర్ పనిచేయనుంది. ఎయిర్ టెల్ తో అనుసంధానమై ట్రూకాలర్ ‘ఎయిర్ టెల్ ట్రూకాలర్ ఐడీ’ ఆఫ్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏదైనా ఎయిర్ టెల్ నెంబరు నుంచి కాల్ వస్తే ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా కూడా చేసిన వ్యక్తి వివరాలు తెలుస్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.