యాప్నగరం

గున్న ఏనుగు తెలివికి ఖంగుతిన్న అధికారులు!

జంతువులు కూడా అప్పుడప్పుడు.. అబ్బురపరిచే చర్యలతో మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటి ఘటనే ఒకటి..

TNN 19 Apr 2017, 5:06 pm
ఈ భూమిపై ఒక మనిషికి మాత్రమే తెలివి ఉందని, మనుషులు మినహా.. మిగిలిన జంతువులన్నింటికీ ఏ మాత్రం తెలివి లేదని మనలో చాలా మంది విర్రవీగుతుంటారు. కానీ, జంతువులు కూడా అప్పుడప్పుడు.. అబ్బురపరిచే చర్యలతో మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలోని నగరహోల్ సాంక్చుయరీ ప్రాంతంలో చోటు చేసుకుంది. బన్నేరుఘట్ట నేషనల్ పార్క్, బందీపూర్ పరిసర ప్రాంతాల్లోని అడవుల నుంచి తరచూ ఏనుగులు వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. వీటి దాడికి కాఫీ రైతులు బాగా నష్ట పోతున్నారు. ఈ ప్రాంతంలో అవి రైల్వే ట్రాక్‌లు దాటుతూ పెద్ద సంఖ్యలో మృత్యువాత కూడా పడుతున్నాయి. ఈ సమస్య నుంచి పరిష్కారం కోసం.. రైతులతో పాటు, అటవీ అధికారులు కూడా అనేక విధాలుగా ఆలోచించారు. తొలుత వారు ఆయా ప్రదేశాల్లో భారీకేడ్లను ఏర్పాటు చేశారు. ఏనుగులు.. వాటిని తొండంతో అలవోకగా ఎత్తి పారేశాయి. ఆ తర్వాత పెద్ద పెద్ద గోతులు తవ్వించారు. కొన్ని ప్రాంతాల్లో భారీ ఖర్చుతో కంచెను ఏర్పాటు చేసి, వాటి తీగల్లో కరెంట్ సరఫరా చేశారు.
Samayam Telugu images of elephant crossing barricade goes viral
గున్న ఏనుగు తెలివికి ఖంగుతిన్న అధికారులు!


అధికారులకు ఇటీవల ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. రైల్వే ట్రాకుల వెంట పాడైపోయి, పనికిరాకుండా ఉన్న పాత పట్టాలను ఉపయోగించి వారు ట్రాకుల వెంట కంచె లాంటి ఏర్పాటు చేశారు. తద్వారా తక్కువ ఖర్చుతోనే సులభమైన పరిష్కారం దొరికిందని, ఇక ఏనుగులు వాటిని దాటి రాలేవని భావించారు. కానీ, తాజాగా ఓ గున్న ఏనుగు.. అచ్చం మనిషిలానే ఆ కంచెను జాగ్రత్తగా దాటి మరోసారి అధికారులకు సవాల్ విసిరింది. వాటి చర్యలను రోజూ గమనిస్తూ ఉన్న ఓ అటవీ అధికారి.. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఇవి వైరల్‌గా మారాయి.





Read this story in Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.