యాప్నగరం

రికార్డులు తిరగరాసేస్తున్నాడు

సాధారణంగా ఎవరైన ఒక గిన్నిస్ రికార్డ్ కొట్టాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఒక వ్యక్తి ఇలా 36 ఏళ్లుగా దాదాపు 550 గిన్నిస్‌ రికార్డులను నెలకొల్పాడు. న్యూయార్క్‌కు చెందిన ఆశ్రిత ఫర్మాన్‌ అత్యధిక గిన్నిస్‌ రికార్డులున్న వ్యక్తిగా పేరు సాధించాడు.

TNN 7 Nov 2016, 2:31 pm
సాధారణంగా ఎవరైన ఒక గిన్నిస్ రికార్డ్ కొట్టాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఒక వ్యక్తి ఇలా 36 ఏళ్లుగా దాదాపు 550 గిన్నిస్‌ రికార్డులను నెలకొల్పాడు. న్యూయార్క్‌కు చెందిన ఆశ్రిత ఫర్మాన్‌ అత్యధిక గిన్నిస్‌ రికార్డులున్న వ్యక్తిగా పేరు సాధించాడు. ఈయన న్యూయార్క్‌లో చిన్మయ్‌ అనే భారతీయ ధ్యాన గురువు దగ్గర శిష్యరికం చేశాడు. తర్వాత ఒకసారి ఇరవై నాలుగు గంటల పాటు సైకిల్‌ తొక్కే పోటీలో పాల్గొన్నాడు. అందులో మూడో స్థానంలో నిలిచాడు.
Samayam Telugu interesting facts about ashrita furman
రికార్డులు తిరగరాసేస్తున్నాడు


ఆ తరువాత ఆపకుండా 27వేల జంపింగ్‌ జాక్స్‌ (గాల్లోకి ఎగిరి దూకడం) చేసి తొలి రికార్డు సృష్టించాడు. స్విమ్మింగ్‌ పూల్‌ లోపల ఎక్కువ దూరం (2.8కి.మీ) సైకిల్‌ తొక్కడం, కారుని 24కి.మీలు లాక్కెళ్లడం, తలమీద పాల సీసా పెట్టుకుని 120కి.మీ నడవడం, పెద్ద బంతిపైన ఎక్కువసేపు తూలకుండా నిల్చోవడం(2గం.16ని.), అతిపెద్ద పెన్సిల్‌ తయారీ (72 అడుగులు)... ఇలా మొత్తందాదాపు 550 గిన్నిస్‌ రికార్డులను నెలకొల్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.