యాప్నగరం

ఏడుస్తూనే వార్తలు చదివిన యాంకర్!

ఓ వార్తా ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న మహిళ.. అకస్మాత్తుగా అదే ఛానెల్‌కు సంబంధించిన విషాధ వార్తను చెప్పాల్సి రావడంతో..

TNN 11 May 2017, 2:16 pm
ఓ వార్తా ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న మహిళ.. అకస్మాత్తుగా అదే ఛానెల్‌కు సంబంధించిన విషాధ వార్తను చెప్పాల్సి రావడంతో లైవ్‌లోనే కన్నీటి పర్యంతమైంది. తాను పనిచేస్తున్న టీవీ ఛానెల్‌ మూతపడిందని తెలిసి ఆమె ఏడుస్తూనే ఆ వార్త చెప్పింది. ఇజ్రాయెల్‌కి చెందిన ఛానెల్‌ 1 అనే వార్తా సంస్థలో గ్యులా ఈవెన్‌ అనే యువతి యాంకర్‌గా పనిచేస్తోంది. ఈ న్యూస్ ఛానెల్‌‌కు ఇజ్రాయెల్‌లో మంచి గుర్తింపు ఉంది. దాదాపుగా 49 ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంస్థ కావడంతో దానిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మంది ఆధారపడి ఉన్నారు.
Samayam Telugu israeli news anchor fights back tears announcing shutdown of their channel
ఏడుస్తూనే వార్తలు చదివిన యాంకర్!


కొన్ని రాజకీయ వివాదాల కారణంగా ఇజ్రాయెల్ దేశ ప్రధాని బెంజమిన్‌ నేతన్యాహు కొన్ని మీడియా సంస్థలపై ఆంక్షలు విధించారు. ఆ దేశ న్యాయ శాఖా మంత్రి మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక ఆ ఛానెల్‌‌ను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరుసటి రోజు.. ఉదయపు బులిటెన్ సందర్భంగా ఆ ఛానెల్‌కు ఈ వార్త తెలిసింది. ఆ సమయంలో వార్తలు చదువుతున్న గ్యులా ఆ న్యూస్ బెబుతూ తీవ్ర ఉద్వేగానికి లోనైంది.

ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న తమ ఛానెల్ చాలా ఎత్తుపల్లాలను చూసిందని.. కానీ, ఇలా హఠాత్తుగా మూతపడటంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆ తర్వాత ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.