యాప్నగరం

చీరకట్టులో మెరిసిన జపాన్ యువకులు!

భారతీయ చీరకట్టంటే విదేశీ మహిళలు ఎంత మక్కువో మనం చాలాసార్లు చూశాం.

TNN 12 May 2017, 1:27 pm
భారతీయ చీరకట్టంటే విదేశీ మహిళలు ఎంత మక్కువో మనం చాలాసార్లు చూశాం. భారత్‌లో పర్యటించేందుకు వచ్చే చాలా మంది విదేశీ మహిళలు మన చీరలు కట్టుకోవడమే కాకుండా వాటిని కొనుక్కొని తీసికెళ్తారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆయన సతీమణి మిచెల చీరకట్టులో మెరిశారు. హిల్లరీ క్లింటన్‌కు కూడా చీరలంటే మక్కువే.
Samayam Telugu japanese men celebrating wearing sarees at hampi
చీరకట్టులో మెరిసిన జపాన్ యువకులు!


అయితే విదేశీ మహిళలకే కాకుండా పురుషులకు కూడా చీరలంటే ఎంత ఇష్టమో ఈ సంఘటనను చూస్తే అర్థమవుతుంది. కర్ణాటకలోకి ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన హంపికి వచ్చిన ఇద్దరు జపాన్ యువకులు అక్కడ తయారయ్యే చేనేత చీరలను చూసి ముగ్ధులయ్యారు. వెంటనే వాటిని ధరించి ఫొటోలు దిగారు. చీరలు మహిళలు మాత్రమే ధరిస్తారని స్థానికులు చెప్పినా వారు వినలేదు. మన చీర విదేశీ మహిళలనే కాదు.. పురుషులను కూడా ఎంతగా ఆకర్షిస్తోందో దీన్ని బట్టి అర్థమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.