యాప్నగరం

‘అమ్మ’ చెప్పులు, చీరలు ఇంకా కోర్టులోనే!

అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారంటూ జయలలిత ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

TNN 9 Dec 2016, 5:35 pm
అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారంటూ జయలలిత ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 1996లో ఓసారి ఆదాయపు పన్ను అధికారులు దాడి చేసి జయకు చెందిన ఆస్తులను సీజ్ చేశారు. అలా సీజ్ చేసిన వాటిలో 10,500 పట్టు చీరలు, 750 చెప్పులు, 500 వైన్ గ్లాసులు కూడా ఉన్నాయి. అవి ఇప్పటికీ కర్ణాటక కోర్టు ఆధీనంలోనే ఉన్నాయి. ఆ కేసు సుప్రీంకోర్టు పరిధిలో విచారణ జరుగుతోంది. తాజాగా విచారణను కోర్టు 2017 జూన్‌కి వాయిదా వేసింది. అన్నాడీఎంకే నేతలు మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ఇప్పుడైనా త్వరగా కేసును తేల్చేసి ఆ చీరలు, చెప్పులు, గ్లాసులను విడుదల చేస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. వాటన్నింటిని మ్యూజియంలో అమ్మ జ్ఞాపకాలుగా ఉంచుతామని చెప్పారు.
Samayam Telugu jayalalithaas saris and slippers are still in the custody
‘అమ్మ’ చెప్పులు, చీరలు ఇంకా కోర్టులోనే!


కాగా కర్ణాటక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య మాట్లాడుతూ కేసులో నిందితుల పేర్లు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే కేసు విచారణ ఇప్పట్లో తేలదని, ఇంకా కొనసాగే అవకాశం ఉందని చెప్పారు.

అక్రమాస్తుల కేసు విచారణ 2002లో కర్ణాటక కోర్టుకు బదిలీ కావడంతో సీజ్ చేసిన చీరలు, చెప్పులు, గ్లాసులు కూడా ఆ కోర్టుకే అప్పజెప్పారు. వాటిని కర్ణాటక పోలీసులు సిటీ సివిల్ కోర్టు మొదటి అంతస్తులోని గదిలో ఉంచారు. వాటికి నిత్యం నలుగురు పోలీసులు కాపలా కాస్తూ ఉంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.