యాప్నగరం

జర్నలిస్టుని చంపేస్తానని బెదిరించిన మంత్రి

ఎన్నికల్లో మద్దతు ఇవ్వకపోతే, తనని సజీవదహనం చేస్తానని ఓ మంత్రి గారు బెదిరిస్తున్నారని పేర్కొంటూ ఓ జర్నలిస్ట్..

Times Now 12 Feb 2017, 8:05 am
ఎన్నికల్లో తనకి మద్దతు ఇవ్వకపోతే, తనని సజీవదహనం చేస్తానని ఓ మంత్రిగారు బెదిరిస్తున్నారని పేర్కొంటూ ఓ జర్నలిస్ట్ ఖుషీనగర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తనకి మద్దతు ఇవ్వకపోతే చంపేస్తానని యూపీ వైద్య విద్యాశాఖ మంత్రి రాధే శ్యామ్ సింగ్ బెదిరింపులకి పాల్పడుతున్నారని జర్నలిస్ట్ ఎస్పీ ఎదుట వాపోయారు. మంత్రి రాధేశ్యామ్ సింగ్ తనని బెదిరించారనేందుకు ఆధారంగా ఫోన్ కాల్ ఆడియో ఫైల్‌ని కూడా తన ఫిర్యాదుతోపాటే ఎస్పీకి అందించారు బాధితుడు.
Samayam Telugu journalist abused and threatened by up state minister radhay shyam singh
జర్నలిస్టుని చంపేస్తానని బెదిరించిన మంత్రి


ఇదిలావుంటే, మార్చి 4న జరగనున్న ఎన్నికల్లో ఖుషీ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న రాధేశ్యామ్ సింగ్‌కి ఇలా బెదిరింపులకి పాల్పడటం కొత్తేమీ కాదని తెలుస్తోంది. గతంలోనూ స్థానిక అధికారుల పట్ల రాధేశ్యామ్ సింగ్ అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలున్నాయని సమాచారం. తనకు అనుకూలంగా వ్యవహరించకపోతే మీ కూతురిని రేప్ చేస్తానని సదరు అధికారులని బెదిరించిన చరిత్ర ఈ మంత్రిగారి సొంతం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఆ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తుని ప్రాథమిక స్థాయితే పరిమితం చేసిన పోలీసులు రాధే శ్యామ్ సింగ్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.