యాప్నగరం

విషమిస్తున్న కాశ్మీర్ పరిస్థితి..

తీవ్రవాది బుర్హాన్ సైనికుల చేతిలో హతమైనప్పటినుండి కాశ్మీర్ లోయ అట్టుడికిపోతోంది.

TNN 14 Jul 2016, 7:30 pm
తీవ్రవాది బుర్హాన్ సైనికుల చేతిలో హతమైనప్పటినుండి కాశ్మీర్ లోయ అట్టుడికిపోతోంది. సామాన్య ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ఆ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో దీని ప్రభావం వర్తక వ్యాపారాలపై కూడా పడింది. ఆ రాష్ట్రం నుండి మిగిలిన రాష్ట్రాలకు ప్రతీరోజు పెద్ద ఎత్తున కూరగాయలు, పండ్లు సరఫరా అవుతుంటాయి. కర్ఫ్యూ కారణంగా ఎక్కడి పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయి. ముఖ్యంగా పూంచ్ జిల్లాలో దీని ప్రభావం అధికంగా ఉంది. ఒక్క కూరగాయలు, పండ్లే కాకుండా నిత్యావసరాలు కూడా స్థానికంగా నిండుకున్నాయి. దాంతో ప్రజల ఇబ్బందులు ఇన్నన్ని కావు.
Samayam Telugu kashmir unrest affects fruits vegetables supply
విషమిస్తున్న కాశ్మీర్ పరిస్థితి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.