యాప్నగరం

ఈ పెన్‌తో రాస్తే జవాబులు తెలియపోయినా పాస్ పక్కా!

మార్చి సమీపించిందంటే విద్యార్థులకు పరీక్షల భయం ముంచుకొస్తుంది. ఏడాది పొడవునా ఎంత కష్టపడ్డా పరీక్షల్లో మాత్రం ప్రతిభను చాటుకోవాల్సి ఉంటుంది.

TNN 16 Mar 2017, 3:06 pm
మార్చి సమీపించిందంటే విద్యార్థులకు పరీక్షల భయం ముంచుకొస్తుంది. ఏడాది పొడవునా ఎంత కష్టపడ్డా పరీక్షల్లో మాత్రం ప్రతిభను చాటుకోవాల్సి ఉంటుంది. బాగా చదివే విద్యార్థులు మాటేమోగానీ, సగటు లేదా అంతంత మాత్రమే చదివే పిల్లలకు పరీక్షలంటే భయం. కొన్నిసార్లు ఎంత బాగా చదివినా వ్యాకులత వల్ల రాసే సమయానికి సమాధానాలు గుర్తుకురావు. ఒకవేళ వచ్చినా తప్పులు రాసే అవకాశం ఉంది. దీంతో అనుకున్న మార్కులు రావు సరికదా, ఉత్తీర్ణులు కాకపోవచ్చు.
Samayam Telugu kastabanjan temple in panchmahal district at gujrat
ఈ పెన్‌తో రాస్తే జవాబులు తెలియపోయినా పాస్ పక్కా!


పెన్ను పెట్టగానే దానంతట అదే సమాధానాలు రాస్తే ఎంత బాగుండు అని కొంతమంది విద్యార్థులు అనుకుంటారు. వీరి బలహీనతల్ని సొమ్ము చేసుకోడానికి ఓ బాబా నిజంగానే అలాంటి పెన్నులను అమ్ముతున్నాడు. తన దగ్గర కొనే కలంతో పరీక్షలు రాస్తే పాస్ పక్కా అంటున్నాడు. అంతేకాదు ఫెయిల్ అయితే డబ్బులు తిరిగి చెల్లిస్తానని ఛాలెంజ్ చేస్తున్నాడు.

గుజరాత్‌ పంచమహల్‌ జిల్లాలోని కష్టబంజన్‌ దేవాలయంలో ఈ పెన్నులను అమ్ముతున్నారు. స్థానికంగా ఉండే దుశ్యంత్‌ బాపూజీ అనే సాధువు హనుమాన్‌, సరస్వతి యజ్ఞం చేసి ఈ పెన్నులకు మహిమలు తెప్పించానని చెప్పుకుంటున్నాడు. దానితో పరీక్షలు రాస్తే జవాబులు తెలియకపోయినా తనంతట తానే రాసేస్తుందని ప్రకటిస్తున్నాడు. తప్పులు ఉన్నా సరిచేస్తుందట.

అయితే ఈ పెన్ను ఖరీదు కూడా చాలా ఎక్కువే. ఒక్కో కలం వెల రూ. 1900గా నిర్ణయించాడు. దీన్ని ఉపయోగించి పరీక్ష రాసినవారు ఎవరైనా ఫెయిల్‌ అయితే ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడట. పదో తగరతి, ఇంటర్‌ విద్యార్థులే లక్ష్యంగా ఈ పెన్‌ మహిమ గురించి వివరిస్తూ ముద్రించిన కర పత్రాలు పంచుతుండటంతో ఇది వైరల్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.