యాప్నగరం

ఉత్త చేతులతో... 124 కొబ్బరి కాయలు...

కొబ్బరి కాయ గుడి దగ్గర కొట్టడానికి రెండు మూడు సార్లు రాయికేసి కొడుతుంటాం.

TNN 1 Mar 2017, 3:45 pm
కొబ్బరి కాయ గుడి దగ్గర కొట్టడానికి తెగ కష్టపడతాం. రెండు మూడు సార్లు రాయికేసి కొడుతుంటాం. అలాంటిది ఓ వ్యక్తి ఉత్త చేతులతో నిమిషంలో 124 కొబ్బరికాయలని పగుల గొట్టి చూపించాడు. అతని పేరు అబీష్ పి. డొమనిక్. పూంజార్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. కేరళ ఆర్టీసీలో తాత్కాలిక మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి రికార్డులు సృష్టించడం అంటే చాలా ఇష్టం. అందులోనూ విరగ్గొట్టడంలో రికార్డులు నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంతకుముందు హాకీ స్టిక్కులు, హెల్మెట్స్ విరగొట్టి చూపించాడు. అలాగే బస్సుకి తాడు కట్టి ఆ తాడును నోట్లోని పళ్లతో పట్టుకుని 50 మీటర్లు లాక్కెళ్లి రికార్డు సృష్టించాడు. తాజాగా త్రిస్సూరులోని సోబా సిటీ మాల్ లో నిమిషంలో 145 కొబ్బరి కాయలు పగుగొట్టాడు. అది కేవలం ఉత్త చేతులతో. అంటే కొబ్బరి కాయని నేలకేసి కొట్టడం కాదు, చేత్తో కొట్టడం. చేతికి చిన్నచిన్నగాయాలు తగిలినా అతను పట్టించుకోడు. అయితే 145 కొబ్బరికాయలలో 124 మాత్రమే పూర్తిగా పగిలాయి. అదైనా గొప్పే కదా.
Samayam Telugu kerala man smashes 124 coconuts with bare hands in a minute
ఉత్త చేతులతో... 124 కొబ్బరి కాయలు...






Malayalam Link:

http://malayalam.samayam.com/social-news/indian-man-smashes-124-coconuts-with-his-bare-hands-in-under-a-minute/articleshow/57396304.cms

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.