యాప్నగరం

వాతావరణ సమాచారానికి టోల్ ఫ్రీ నెంబర్

మీరు ఇండియాలో ఏదైనా టూర్ ప్లాన్ చేసుకునే ముందు ఆ ప్రాంతంలో వాతావరణ సమాచారాన్ని భారత ప్రభుత్వమే ఎప్పటికప్పుడు అందించనుంది...

TNN 6 Oct 2016, 11:26 am
మీరు ఇండియాలో ఏదైనా టూర్ వేయాలనుకుంటున్నారా..? టూర్ ప్లాన్ చేసుకునే ముందు ఆ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది? భారీ వర్షాలు ఏమైనా ఉన్నాయా..? చలి ఎక్కువగా ఉందా..? మొత్తానికి అక్కడ వాతావరణం అనుకూలంగా ఉందా.. లేదా? అని తెలుసుకోవటానికి టీవీ ఛానెల్స్‌లో వచ్చే గాలి వార్తల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత ప్రభుత్వమే ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం అందించనుంది. భారత ప్రభుత్వ పర్యాటక శాఖ వాతావరణ సమాచారాన్ని అందించటం కోసం 1800 180 1717 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రవేశ పెట్టింది. విదేశాల నుండి భారత్ వచ్చే వారు లేదా భారత్‌లోని వివిధ ప్రదేశాలను పర్యటించాలనునే వారు ఎప్పుడైనా ఆ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఆయా ప్రదేశాల్లో వాతావరణ ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ ట్వీట్ చేశారు.
Samayam Telugu know weather information instantly in india by calling a toll free number
వాతావరణ సమాచారానికి టోల్ ఫ్రీ నెంబర్


Travelling to/in India? Want weather updates on the go? Call toll free number 1800 180 1717 & get instant weather information Share & inform pic.twitter.com/nQu7Icrfo2 — Dr. Mahesh Sharma (@dr_maheshsharma) October 6, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.