యాప్నగరం

ఆ ఎమ్మెల్యే తలో రూ.3 లక్షలు పంచాడట!

బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు ఓ ఎమ్మెల్యే తనకు నమ్మకస్తులైన వారికి తలో రూ.3 లక్షల చొప్పున పంపిణీ చేశారట.

TNN 10 Nov 2016, 3:27 pm
కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లపై నిషేధం విధించడంతో నల్ల పెద్దల కష్టాలు పెరిగిపోతున్నాయి. కర్ణాటకలోని కోలార్ ఎమ్మెల్యే తన వద్దనున్న బ్లాక్ మనీని వదిలించుకొనేందుకు ఓ పథకమే వేశాడంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. తన దగ్గర భారీగా మూలుగుతున్న నల్లధనాన్ని చెలమణిలోకి తెచ్చేందుకు, రూ.500 కరెన్సీలు చెల్లకుండా పోయే ప్రమాదం నుంచి కాపాడేందుకు ఆయనకో ఐడియా తట్టిందట. తన దగ్గరున్న సొమ్మును నమ్మకస్తులైన వారికి తలో రూ.3 లక్షల చొప్పున పంచాడంటూ.. ఆయన డబ్బును పంచుతున్న ఫొటోలను షేర్ చేశారు.
Samayam Telugu kolar mla distributed rs 3 lakhs black money
ఆ ఎమ్మెల్యే తలో రూ.3 లక్షలు పంచాడట!


అయితే ఈ విషయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ ఫొటోలు సోమవారం నాటివని, సహకార బ్యాంకుల తరఫున అర్హులైన వారికి రుణంగా వాటిని అందజేశానని ఆయన వివరణ ఇచ్చారు. మేం లబ్ధిదారులకు మేం చెక్కులను ఇచ్చాం. వాటిని నగదుగా మార్చి.. వారికి అందజేసే సందర్భంలో తీసిన ఫొటోలివని సహకార బ్యాంకు అధ్యక్షుడు తెలిపారు. ఎమ్మెల్యే సొమ్మును సోమవారమే అందజేయగా, రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం మంగళవారం ప్రకటన వెలువరించిందని ఆయన గుర్తు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.