యాప్నగరం

బాలీవుడ్ స్టార్‌నే ఫోటో తీయమన్నారు

ఓ కొత్త జంట కొరియా నుంచి స్విట్జర్లాండ్ కు పర్యటనకు వెళ్లింది.

TNN 15 Aug 2016, 9:40 am
ఓ కొత్త జంట కొరియా నుంచి స్విట్జర్లాండ్ కు పర్యటనకు వెళ్లింది. అక్కడ ఆకాశాన్ని తాకేలా ఉన్న కొండలు... వాటిపై పరుచుకున్న మంచు... వారికి చాలా ఆకర్షించింది. ఇద్దరికీ జంటగా ఫోటో తీయించుకోవాలనిపించింది. ఎదురుగా ఓ యువకుడు ఇటూ అటూ తిరుగుతూ కనిపించాడు. అతని దగ్గర కెళ్లి... మా ఇద్దరికీ కొండల బ్యాక్ గ్రౌండ్ లో ఫోటో తీయరు అని అడిగారు. ఆ యువకుడు వెంటనే వారి చేతిలోని కెమెరా అందుకుని క్లిక్ మనిపించాడు. ఇలాంటి సంఘటలు ప్రతి పర్యాటక ప్రాంతం దగ్గర సర్వసాధారణంగా జరిగేవే... కానీ ఇక్కడ ఫోటో తీసింది ఓ పెద్ద స్టార్. ఆ విషయం పాపం ఆ జంటకు తెలియక ఫోటో తీయమని అడిగింది. ఇంతకీ ఆ స్టార్ ఎవరో తెలుసా? బాజీరావ్... అదేనండి రణ్ వీర్ సింగ్. అనంతరం జంటకి అతను రణ్ వీర్ సింగ్ అని తెలిసి తెగ మురిసిపోయింది.
Samayam Telugu korea couple didnt recognise superstar ranveer in switzerland
బాలీవుడ్ స్టార్‌నే ఫోటో తీయమన్నారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.