యాప్నగరం

పెళ్లి కొడుకును కిడ్నాప్ చేసిన రివాల్వర్ రాణి

మంగళవారం సాయంత్రం.. బుందెల్ ఖండ్ లోని ఓ పెళ్లి మండపం.. వరుడు అశోక్ యాదవ్..

Samayam Telugu 17 May 2017, 2:41 pm
మంగళవారం సాయంత్రం.. బుందెల్ ఖండ్ లోని ఓ పెళ్లి మండపం.. వరుడు అశోక్ యాదవ్.. వధువు భారతి యాదవ్ మెడలో తాళి కట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలోనే స్కార్పియో కారు వేగంగా మండపంలోకి దూసుకొచ్చింది. ఒక మహిళ (25) ఇద్దరు మగవారితో కలిసి పెళ్లి పీటలపై కూర్చున్న వరుణ్ని కాలర్ పట్టుకొని లాగిపడేసింది. వరుడు, పెళ్లికి వచ్చిన బంధువులు తిరగబడేలోపు తుపాకీ తీసి.. అశోక్ కణతకు గురి పెట్టింది.
Samayam Telugu lady don stops wedding kidnaps groom in up
పెళ్లి కొడుకును కిడ్నాప్ చేసిన రివాల్వర్ రాణి


‘ఈ అబ్బాయి నన్ను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఇతన్ని కిడ్నాప్ చేస్తున్నాం’ అంటూ క్షణాల్లోనే అక్కడ నుంచి అతణ్ని తీసుకెళ్లారు.

ఊహించని ఈ హఠత్పరిణామానికి పెళ్లి కూతురు భారతి షాకయ్యింది.
సీన్ కట్ చేస్తే.. వరుడు అశోక్.. యాదవ్ పనిచేసే చోట ఒక యువతిని ప్రేమించాడు. ఒకర్నినొకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్ల ఒత్తిడో లేక మరే కారణమో తెలీదు గానీ... ఆ అమ్మాయిని కాదని అశోక్.. భారతి అనే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు.

లేవదీసుకుపోయిన అమ్మాయిని తన కొడుకు మోసం చేసుంటాడని అబ్బాయి తండ్రి అంటున్నాడు. అశోక్ పనిచేసే చోటికి తండ్రి వెళ్తే కూడా అక్కడ ఎక్కవ ఉండనిచ్చేవాడు కాదని ఆయన అంటున్నాడు.

భారతి కుటుంబ సభ్యులు అశోక్ పై కేసు పెట్టారు.

ఇదిలా ఉండగా కిడ్నాప్ చేసిన అమ్మాయిని అశోక్ పెళ్లి చేసుకొని ఉంటాడని స్థానికులు అంటున్నారు. పోలీసులు మాత్రం ‘రివాల్వర్ రాణి’ని మెచ్చుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయిలుంటే అబ్బాయిలు జాగ్రత్తగా ఉంటారని, మరో అమ్మాయిని మోసం చేయరని అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.