యాప్నగరం

రోడ్డు మీద నడుస్తూ మొబైల్ చూస్తే ఫైన్!

స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎదుటివారిని గమనించడమే గగనమైపోయింది. పక్కనున్నవారి వైపు తలెత్తి చూడటం కూడా మానేశారు.

TNN 25 Oct 2017, 4:49 pm
స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎదుటివారిని గమనించడమే గగనమైపోయింది. పక్కనున్నవారి వైపు తలెత్తి చూడటం కూడా మానేశారు. గతంలో రోడ్లపై నడిచేటప్పుడు, బస్సులో ప్రయాణించేటప్పుడు తోటివారిని పలకరించడం, పక్కవారితో మాట్లాడటం చేసేవారు. ఇప్పుడిది చాలా తగ్గిపోయింది. ఎవరికి వారు ఫోన్లలో లీనమైపోయి ప్రపంచంతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నా. కొందరైతే రోడ్లపై నడిచేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలను కూడా గమనించకుండా మొబైల్ మైకంలో మునిగితేలుతారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు ప్రమాదాల బారిన పడటంతో హువాయి రాష్ట్రంలోని ఓ నగరం ఇకపై ఇలా చేయడం కుదరదంటోంది. నడిచేప్పుడు ఎవరైనా ఫోన్‌ చూస్తే భారీ జరిమానా విధిస్తారు.
Samayam Telugu law targets smartphone zombies with crosswalk ban
రోడ్డు మీద నడుస్తూ మొబైల్ చూస్తే ఫైన్!


హోనోలులు నగరంలో నడిచేప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు చూడటంపై నిషేధం విధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. బుధవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. ఎవరైనా నడిచేప్పుడు ఫోన్‌ చూస్తూ కన్పించారో వారికి 15 నుంచి 99 డాలర్ల జరిమానా విధిస్తారు. రోడ్డుపై నడిచే సమయంలో మొబైల్ చూస్తున్నట్లు చిక్కిన ప్రతిసారీ రెట్టింపు జరిమానా ఉంటుంది. ప్రజల భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇటీవల అమెరికాలో రోడ్డు ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. 2016లోనే 5,987 మంది రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది రోడ్డుపై వస్తున్న వాహనాలను గమనించకపోవడంతో ప్రమాదాల బారినపడ్డారు. రోడ్లపై నడిచేటప్పుడు ఫోన్లు వాడటంతో ఎదురుగా వస్తున్న వాటిని పట్టించుకోవట్లేదని, వీటిని నివారించేందుకే కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.