చిట్టి పిల్లలు భలే ముద్దుగా ఉంటారు. వారు చేసిన పనులు కూడా చాలా క్యూట్ గా ఉంటాయి. ఈ చిన్నారిని చూస్తే మరీ ముద్దొచ్చేస్తుంది. జపాన్లో ఉంటోంది ఈ పాప. టీవీలో వస్తున్న ఓ ఇంటర్య్వూలో రాజకీయ నాయకుడు ఏడుస్తూ కనిపించాడు. వెంటనే పాప తాను ఏడిస్తే అమ్మ ఏం చేస్తుందో గుర్తు తెచ్చుకుంది. ఓ కర్చీఫ్ తీసుకుని పరిగెట్టుకుని టీవీ దగ్గరికి వెళ్లి ఆ నాయకుడి కళ్లు తుడిచేసింది. చిన్ని పాప చేసిన పని వీడియో తీసి నెట్ లో పెట్టారు తల్లిదండ్రులు. ఇప్పుడది నెట్ లో హల్ చల్ చేస్తోంది.
ఊరుకో... ఏడవకు...!
చిట్టి పిల్లలు భలే ముద్దుగా ఉంటారు. వారు చేసిన పనులు కూడా చాలా క్యూట్ గా ఉంటాయి.
TNN 14 Jul 2016, 2:29 pm