యాప్నగరం

సమస్యకు పరిష్కారం ఆత్మహత్య కాదు: కీర్తి సురేష్

విద్యార్థిని ఆత్మహత్య ఉదంతం తమిళనాడును అట్టుడికిస్తోంది. ప్రజలు, రాజకీయ నాయకులు వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ అంశంపై స్పందించారు. వైద్య కోర్సులను అభ్యసించడానికి నీట్ (నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)పై రగిలిన వివాదంలో విద్యార్థిని ఎస్.అనిత (18) ఆత్మహత్య చేసుకున్న..

TNN 11 Sep 2017, 8:47 pm
విద్యార్థిని అనిత ఆత్మహత్య ఉదంతం తమిళనాడును అట్టుడికిస్తోంది. ప్రజలు, రాజకీయ నాయకులు వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ అంశంపై స్పందించారు. వైద్య కోర్సులను అభ్యసించడానికి నీట్ (నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)పై రగిలిన వివాదంలో విద్యార్థిని ఎస్.అనిత (18) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనిత మృతిపై తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, కమల్ హాసన్, డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌ సంతాపం వ్యక్తం చేశారు.
Samayam Telugu lost future savior says keerthy suresh on medical aspirant anithas suicide
సమస్యకు పరిష్కారం ఆత్మహత్య కాదు: కీర్తి సురేష్


నీట్‌ కారణంగా దళిత విద్యార్థిని అనిత కలలు ఆవిరైపోయాయని రజనీకాంత్ అన్నారు. రాజకీయ బేరసారాలతో తమిళనాడు ప్రభుత్వం నిరుపయోగంగా మారిందని ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. తాజాగా ఈ ఘటనపై యువ కథానాయిక కీర్తి సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

‘ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమెకు దక్కాల్సింది దక్కకపోతే తన కలలను ఎలా సాకారం చేసుకోగలుగుతుంది. ఓ మంచి మనిషిని, భవిష్యత్తు రక్షకురాలిని.. అన్నింటికంటే మిన్నగా ఓ స్త్రీ శక్తిని కోల్పోయాం’ అని కీర్తి పేర్కొంది. సమస్యలకు పరిష్కారం​ ఆత్మహత్య కాదని, ఆత్మహత్య చేసుకోవద్దని ఆమె యువతకు విజ్ఞప్తి చేసింది.
#RIPAnitha #Strengthtoherfamily pic.twitter.com/2G8TehrpQj — Keerthy Suresh (@KeerthyOfficial) September 2, 2017
తల్లి మరణించినా.. అనిత అనేక కష్టాలకోర్చి చదువులో రాణిస్తూ వచ్చింది. రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు పరీక్షల్లో ఆమె 1200 మార్కుల‌కుగాను 1176 మార్కులు సాధించింది. మెడిసిన్ క‌టాఫ్‌లో 196.75 మార్కులు వ‌చ్చాయి. నీట్ ప‌రీక్ష‌లో మాత్రం ఆమెకు 86 మార్కులే రావడంతో ఎంబీబీఎస్ సీటు రాలేదు.

‘నీట్ ప‌రీక్ష‌ను ప్రామాణికంగా తీసుకోవద్దు.. నాకు డాక్ట‌ర్ కావాల‌ని ఉంది. ఇంట‌ర్ మార్కుల‌ను బేస్‌గా తీసుకుంటే నాకు మెడిక‌ల్ సీటొస్తుంది’ అంటూ అనిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. అనితతో పాటు మరికొంత మంది విద్యార్థులు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

కానీ, సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. నీట్‌ ఆధారంగానే ప్రవేశాలు చేపట్టాలని ఆగస్టు 22న తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆందోళనకు గురైన అనిత ఆత్మహత్య చేసుకుంది.

మరోవైపు బాధిత విద్యార్థిని కుటుంబానికి రూ. 7 లక్షల పరిహారం అందించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. నీట్ వివాదం నుంచి రాష్ట్రాన్ని బయట పడేసేలా ప్రయత్నాలు చేయాలంటూ ఆందోళన తీవ్రమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.