యాప్నగరం

ఢిల్లీలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి మీరు వినే ఉంటారు.

TNN 24 Nov 2016, 7:04 pm
ప్రఖ్యాతిగాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి మీరు వినే ఉంటారు. లండన్‌లో ఉన్న ఈ మ్యూజియంలో ప్రముఖుల విగ్రహాలను మైనంతో చేసి పెడతారు. దీని బ్రాంచిలు వివిధ దేశాల్లో 21 ఉన్నాయి. మ్యూజియం నిర్వాహకులు 22వ మ్యూజియాన్ని ఢిల్లీలో ప్రారంభించబోతున్నారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో వచ్చే ఏడాది దీని నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. భారత దేశంలోని ప్రముఖుల విగ్రహాలను తయారు చేసి పెట్టనున్నారు. ప్రధాని మోడీ, సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, మహాత్మగాంధీ వంటి వారి విగ్రహాలు మొదటి దశలో తయారు చేసి పెట్టనున్నారు. లండన్ ప్రధానకేంద్రంగా మెర్లిన్ ఎంటర్ టైన్‌మెంట్ అనే సంస్థ ఈ మ్యూజియాలను ఏర్పాటు చేసి, నిర్వహణ బాధ్యతలు చూస్తోంది.
Samayam Telugu madame tussauds museum is all set to open in delhi next year
ఢిల్లీలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.