యాప్నగరం

75 ఇళ్లున్న కుగ్రామం నుంచి 47 మంది ఐఏఎస్‌లు!

కేవలం 75 ఇల్లు ఉండే ఓ కుగ్రామం నుంచి ఇప్పటి వరకు 47 మంది ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.

TNN 7 Jun 2017, 8:08 pm
కేవలం 75 ఇల్లు ఉండే ఓ కుగ్రామం నుంచి ఇప్పటి వరకు 47 మంది ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఇది ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో మధోపట్టి అనే గ్రామం గొప్పదనం. అఖిల భారత సర్వీసులకు ఓ కుగ్రామం నుంచి 47 మంది ఎంపికకావడం సాధారణ విషయం కాదు. సరస్వతీ పుత్రులకు నిలయమైన తమ గ్రామంలోని యువకులు దేశసేవలో తరిస్తారని గ్రామస్థులు మురిసిపోతుంటారు. ఇంటర్ నుంచే సివిల్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించి లక్ష్యసాధనకు నిరంతర ప్రయత్నించడమే తమ విజయానికి ప్రధాన కారణమంటారు యువ ఐఏయస్‌లు. ఈ గ్రామానికి చెందిన ప్రముఖ రచయిత కుమారుడైన ముస్తఫాహుస్సేన్ బ్రిటిష్ ఇండియాలో 1914 ఐసీఎస్ పరీక్షల్లో తొలిసారి ఉత్తీర్ణత సాధించి అఖిల భారత సర్వీసులో చేరాడు.
Samayam Telugu madhopatti is the true incredible india
75 ఇళ్లున్న కుగ్రామం నుంచి 47 మంది ఐఏఎస్‌లు!


స్వాతంత్రం తర్వాత 1955 సివిల్ సర్వీసెస్‌లో రెండో ర్యాంక్ సాధించిన ఇందూప్రకాశ్ సింగ్ ముస్తాఫాహుస్సేన్‌ను ప్రేరణగా తీసుకున్నాడు. అప్పటి నుంచి మధుపట్టి గ్రామంలోని యువకులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటూ దేశప్రగతికి తమ వంతు కృషి చేయటానికి ఎంతో కష్టపడుతున్నారు. ఈ గ్రామానికి చెందిన యువకులు సివిల్ సర్వీసెస్‌తోపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్, ప్రపంచ బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్నారు.

2016 సివిల్స్ ఫలితాల్లోనూ ఈ గ్రామానికి చెందిన వారు సత్తా చాటారు. ఈ గ్రామంలోని విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తికాగానే సివిల్ సర్వీసెస్‌పైనే తమ దృష్టని కేంద్రీకరిస్తారు. చిన్నతనం నుంచి హిందీనే చదవడం వల్ల ఆంగ్లంలో పట్టులేకపోవడంతో దీన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూ, పరీక్షల కోసం సిద్ధమవుతారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.