యాప్నగరం

మహిళల కోసమే ఆ రైలు.. పట్టించుకోని మగాళ్లు!

మహిళల కోసం కేటాయించిన బస్సుల్లోకి గబగబా ఎక్కేసి.. తీరా విషయం తెలిశాక ముసిముసి నవ్వులు చిందిస్తూ దిగిపోయే వారిని మనం తరచూ చూస్తూనే ఉంటాం..

TNN 21 Apr 2017, 2:57 pm
మహిళల కోసం కేటాయించిన బస్సుల్లోకి గబగబా ఎక్కేసి.. తీరా విషయం తెలిశాక ముసిముసి నవ్వులు చిందిస్తూ దిగిపోయే వారిని మనం తరచూ చూస్తూనే ఉంటాం.. కలకత్తా లాంటి నగరాల్లో మహిళల కోసం బస్సులనే కాకుండా.. కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు. కానీ, ఇలాంటి ట్రెయిన్లలో పురుషులు దర్జాగా ప్రయాణం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. డోర్ల దగ్గర వేలాడుతూ స్త్రీలకు చాలా అసౌకర్యం కల్గిస్తున్నారు. ఇలాంటి రైళ్లలో మగవాళ్లు ప్రయాణించకూడదనే కఠిన నిబంధనలు అమల్లో ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. రైల్వే సిబ్బంది కూడా ఈ విషయంలో చూసి చూడనట్లు ఉంటున్నారు.
Samayam Telugu male passengers regularly appears in matribhumi local ladies special train
మహిళల కోసమే ఆ రైలు.. పట్టించుకోని మగాళ్లు!


కలకత్తా నగర శివార్లలోని హౌరా, సీల్దా స్టేషన్ల మధ్య.. ఆఫీస్ సమయాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా మాతృభూమి లోకల్ ట్రెయిన్‌ను నడుపుతున్నారు. కిక్కిరిసిన జనంతో కూడిన ఈ రైల్లో రోజూ పెద్ద సంఖ్యలో పురుషులు కూడా ప్రయాణిస్తున్నారు.

ఈ రైలు నిన్న (ఏప్రిల్ 20) సోదేపూర్ స్టేషన్‌ నుంచి వెళుతున్న సమయంలో.. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి అమల్ సర్కార్.. వీటికి సంబంధించి ఒక వీడియో తీశారు. అధిక సంఖ్యలో యువకులు.. డోర్ల వద్ద వేళాడుతుండటం ఈ వీడియోలో గమనించవచ్చు. కంపార్టుమెంట్లలో భద్రత కోసం నియమించిన సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా ఈ విషయంలో నిమిత్తమాత్రంగా ఉండటం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.