యాప్నగరం

రెడ్‌ హ్యాం‌డెడ్‌గా దొరికారు.. కట్టేసి కొట్టారు!

ఇంట్లో భర్త లేని సమయంలో మరో యువకుడితో ఏకాంతంగా గడుపుతున్న వివాహితను గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్రమ సంబంధం..

TNN 30 Jun 2017, 5:52 pm
ఇంట్లో భర్త లేని సమయంలో మరో యువకుడితో ఏకాంతంగా గడుపుతున్న వివాహితను గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్రమ సంబంధం నెరపుతున్న ఆ జంటను ఓ చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. బీహార్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో బుధవారం (జూన్ 28) చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. గోపినాథ్ పూర్ అనే గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళ తన పక్క జిల్లా సితామర్హికి చెందిన 27 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భర్త లేని సమయంలో ఆ యువకుడు తరచూ ఆ ఇంట్లోకి వెళుతుండటంపై కొంత మంది గ్రామస్థులు ఓ కన్నేశారు. ఏకాంతంగా గడుపుతున్న ఆ జంటను పట్టుకొని, గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు దాదాపు 20 గంటల పాటు బంధించారు.
Samayam Telugu man and married woman tied to a tree to beaten over an illegal affair
రెడ్‌ హ్యాం‌డెడ్‌గా దొరికారు.. కట్టేసి కొట్టారు!


వాళ్లిద్దరినీ చెట్టుకు కట్టేసి కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు వచ్చి వారిని విడిపించారు. సదరు మహిళకు 8 ఏళ్ల కిందటే పెళ్లి కాగా.. గత మూడేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. పని మీద భర్త ఇంట్లోంచి బయటికెళ్లగానే ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకున్నట్లు ఆమె పోలీసుల విచారణలో అంగీకరించింది.

పోలీసులు ఈ ఘటనపై 2 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొంత మంది గ్రామస్థులపై, ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదుతో సదరు మహిళతో పాటూ ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు. ఆ మహిళ తన ప్రియుడితోనే కలిసి జీవించాలనుకుంటున్నట్టు​ పోలీసుల వద్ద వాపోవడం కొసమెరుపు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.