యాప్నగరం

చెట్టు నరకొద్దన్న ఆయనను నరకబోయారు

చెట్టు నరకొద్దన్నందుకు ముంబైలో ఓ వ్యక్తిపై దాడి జరిగింది.

TNN 4 Nov 2016, 3:08 pm
చెట్టు నరకొద్దన్నందుకు ముంబైలో ఓ వ్యక్తిపై దాడి జరిగింది.
Samayam Telugu man attacked with chopper for asking not to axe tree
చెట్టు నరకొద్దన్న ఆయనను నరకబోయారు


కళ్యాణ్‌ లో సత్యపాల్ ఉపాధ్యాయ్ (32), కాజోల్ (21) కుటుంబాలు ఎదురెదురు ఇళ్లల్లో నివసిస్తున్నారు. తన ఇంటిముందు జామచెట్టును కాజోల్ నరికబోయింది.

జామచెట్టు నరకొద్దని సత్యపాల్ కాజోల్ ను వారించాడు. సత్యపాల్ మాటలు పట్టించుకోని కాజోల్ చెట్టును నరకడం మొదలుపెట్టింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. సత్యపాల్, కాజోల్‌లు వాదులాడుకోవడాన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు సత్యపాల్ ను దూషించారు.

దీంతో కోపంతో ఊగిపోయి కాజోల్ జామచెట్టును నరకడానికి తెచ్చిన కత్తితో సత్యపాల్ పై దాడి చేసింది.

తీవ్రగాయాలపాలైన సత్యపాల్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సత్యపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే ఈ ఇరు కుటుంబాల మధ్య చాలాకాలం నుంచి విబేధాలున్నట్లు చెప్పిన పోలీసులు..కాజోల్, ఆమె తల్లి బిందు (42), తండ్రి సతీష్ (45)లపై కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.