యాప్నగరం

వీడియో: ఎలుగుకు ఆహారం ఇవ్వబోయి..

ఎలుగుకు ఆహారం ఇవ్వాలనుకున్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి

TNN 23 Aug 2017, 12:46 pm
రదాగా సఫారీకి వెళ్లేవారు.. అక్కడి జంతువులను చూసి ఆనందించకుండా, ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. కొంతమంది వాటికి ఆహారం ఇవ్వబోయి.. వాటికే ఆహారమైపోతున్నారు. చైనాలోని బీజింగ్‌‌లో గల బడాలింగ్‌ వైల్డ్‌లైఫ్‌ వరల్డ్‌ పార్కులో ఓ వ్యక్తి ఎలుగు బంట్లకు ఆహారం ఇవ్వబోయి గాయాలపాలయ్యాడు.
Samayam Telugu man bitten by bear after trying to feed it
వీడియో: ఎలుగుకు ఆహారం ఇవ్వబోయి..


కారులో ప్రయాణిస్తున్న ఆ వ్యక్తి అద్దం తెరిచి... ఆహారం ఇవ్వబోయాడు. పాపం ఆ ఎలుగు బంటి నాన్‌వేజ్ కోసం తహతహలాడుతుందో ఏమో.. అమాంతంగా ఆ వ్యక్తి చేయ్యి కూడా తినేయడానికి ప్రయత్నించింది. దీంతో, అతను తన చేయి ఒక్కసారిగా వెనక్కి లాక్కొని వెళ్లిపోయాడు. ఆ ఎలుగు వెనుక ఉన్న రెండు ఎలుగులు కూడా వచ్చి ఉంటే.. పరిస్థితి దారుణంగా ఉండేది.

ఈ ఘటనలో బాధితుడి చేతికి స్వల్పంగా గాయాలయ్యాయి. చైనా జూలలో జంతువులు దాడి చేయడం కొత్తకాదు. గతంలో ఏకంగా మనుషులనే లాక్కొని వెళ్లి తినేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. వాటికి ఆహారం ఇవ్వకూడదని, వాహనాల నుంచి బయటకు రాకూడదని జూ అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా సందర్శకులు మాట వినకుండా ఇలా చిక్కుల్లో పడుతున్నారు.
ఎలుగుబంటి ఎలా దాడి చేసిందో ఈ వీడియోలో చూడొచ్చు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.