యాప్నగరం

అవి కుర్చీలో ఇరుక్కున్నాయని ఐకియా మీద..

జనాలు తెలివిమీరారు. హక్కుల సాధన కోసం దేనికైనా తెగిస్తారు. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే...

Samayam Telugu 4 Sep 2016, 12:53 pm
జనాలు తెలివిమీరారు. హక్కుల సాధన కోసం దేనికైనా తెగిస్తారు. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే...నార్వేకు చెందిన ఫోటోగ్రాఫర్ క్లాజ్ జోర్స్టాడ్ ఐకియా కంపెనీపై ఓ వింత ఫిర్యాదు చేశాడు. వాస్తవంగా అది వింత ఏమీ కాదు కానీ అతడు చేసిన విధానం వింతగా ఉంది. హాస్యం పుట్టిస్తోంది. 45ఏళ్ల వయసున్న క్లాజ్ గతకొంతకాలంగా మెకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. నిలబడి స్నానం చేయలేడు. చైర్ మీద కూర్చొని స్నానం చేయాల్సిందే. అందుకే ఐకియా కంపెనీకి చెందిన ‘మారియస్’ అనే ఓ స్టూలు (రంద్రాలు ఉండే కుర్చీ) కొన్నాడు. షవర్ కింద స్టూలుపై కూర్చోని స్నానం చేస్తున్నప్పడు అతని వృషణం ఒకటి ఆ స్టూలు గడి (రంధ్రం)ల్లోని ఒకదాంట్లో ఇరుక్కుపోయింది. దాంతో క్లాజ్ ప్రాణం విలవిలలాడింది.
Samayam Telugu man complains to ikea after testicle trapped in stool
అవి కుర్చీలో ఇరుక్కున్నాయని ఐకియా మీద..


అయినా ఎలాగోలా అప్పటి స్నానం పూర్తి చేసిన క్లాజ్‌కు వినియోగదారుల హక్కులు గుర్తొచ్చాయి. ఉత్పత్తులతో వినియోగదారులను సంతృప్తి పరచాల్సిన కంపెనీలు.. వినియోగదారులకు ప్రమాదాలు తెచ్చిపెడుతున్నాయని చిరచిరలాడిపోయాడు. ఐకియా ఉత్పత్తిపై మండిపడుతూ కంపెనీ నార్వే పేస్‌బుక్ పేజీలో తన బాధనంతా వెల్లగక్కుతూ ఫిర్యాదు చేశాడు. క్లాజ్ చేసిన ఫిర్యాదుకు సోషల్ మీడియాలో భారీస్పందన వచ్చింది. క్లాజ్ ఫిర్యాదును వేలాదిమంది షేర్ చేసుకున్నారు. అటు ఐకియా కంపెనీ కూడా క్లాజ్ కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించింది. ఇంతలా అతడి ప్రధాన అవయవంతో ఆడుకున్న ఐకియా కంపెనీ నుంచే రంధ్రాలు చిన్నగా ఉండేలా, లేదా అసలే హోల్సే లేకుండా ఉండే మరో చైర్ కోనుగోలు చేయాలనుకుంటున్నట్లు క్లాజ్ చెప్పడం కొసమెరుపు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.