యాప్నగరం

పురుషాంగంలో చాప్‌స్టిక్‌ను దూర్చుకొని..

ఎదిగే కొద్దీ సెక్స్ పట్ల, లైంగిక అవయవాల పట్ల అవగాహన ఎంతో అవసరం. లేకపోతే దెబ్బయిపోతాం అని నిరూపించే ఘటన ఇది..

TNN 18 Nov 2016, 1:53 pm
ఎదిగే కొద్దీ సెక్స్ పట్ల, లైంగిక అవయవాల పట్ల అవగాహన ఎంతో అవసరం. లేకపోతే దెబ్బయిపోతాం అని నిరూపించే ఘటన ఒకటి చైనాలో వెలుగు చూసింది. జిజియాంగ్ ఫ్రావిన్స్‌కు చెందిన ఓ యువకుడు యూరిన్‌లో రక్తం ఎందుకు వస్తుందో తెలుసుకోవడం కోసం ఏడు అంగుళాల మెటల్ చాప్‌స్టిక్‌ను తన పురుషాంగంలోకి దూర్చాడు. తర్వాత బయటకు తీసెందుకు ప్రయత్నిస్తే అది రాకపోగా నొప్పితో విలవిల్లాడాడు. అది ఇరుక్కుంది కానీ తీద్దామని ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్లను సంప్రదించాల్సి వచ్చింది.
Samayam Telugu man lodging a 7 inch stainless steel chopstick in his penis
పురుషాంగంలో చాప్‌స్టిక్‌ను దూర్చుకొని..


స్కానింగ్ చేసిన డాక్టర్లు అది మలద్వారం గోడల వరకూ వెళ్లిందని డాక్టర్లు గుర్తించారు. అది ఇంకా కొంచెం ముందుకెళ్తే.. చనిపోయేవాడని చెప్పారు. ఎలాగోలా తిప్పలు పడి ఆపరేషన్ చేసి దాన్ని జాగ్రత్తగా తీసేశారు. మనోడు చావు తప్పి కన్నులొట్టబొయిన చందంగా బతికి బయటపడ్డాడు. చాలా మంది సెక్స్‌కు సంబంధించిన విషయాల పట్ల అవగాహన లేకపోవడంతో ఇలా రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.