యాప్నగరం

ప్లీజ్ హెల్ప్ మీ అంటూ మొత్తుకున్న ఏటీఎం...!

ఏటీఎంలో నగదు డ్రా చేస్తున్నప్పుడు ప్లీజ్ హెల్ప్ మీ అని రాసి ఉన్న స్లిప్పు బయటకు రావడంతో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

TNN 14 Jul 2017, 1:15 pm
ఏటీఎంలో నగదు డ్రా చేస్తున్నప్పుడు ప్లీజ్ హెల్ప్ మీ అని రాసి ఉన్న స్లిప్పు బయటకు రావడంతో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడికే కాదు మరికొందరు కూడా డబ్బు డ్రా చేస్తుంటే కరెన్సీతోపాటు సాయం చేయాలని రాసిన కాగితాలు రావడంతో పోలీసులు స్పందించి ఆ ఏటీఎం మెషీన్‌ను తెరచి అవాక్కయ్యారు. అందులో ఓ వ్యక్తి చిక్కుకోవడంతో తనను కాపాడమని అతడు ఇలా కాగితాలపై రాసి అందించాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ కార్పస్ క్రిస్టీ ప్రాంతంలోని చోటు చేసుకుంది.
Samayam Telugu man stuck in texas atm dispenses notes for help as receipts
ప్లీజ్ హెల్ప్ మీ అంటూ మొత్తుకున్న ఏటీఎం...!


ఓ పోలీస్ ఆఫీసర్ తన వాహనంలో వెళుతుంటే, అటుగా వచ్చిన వ్యక్తి, సమీపంలోని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏటీఎం నుంచి 'ప్లీజ్ హెల్ప్' అని రాసిన కాగితాలు బయటకు వస్తున్నాయని ఫిర్యాదు చేశాడు. ముందు దీన్ని లైట్‌గా తీసుకున్నా, మరికొందరు కూడా ఇలాగే తెలిపారు. దీంతోఆ అధికారి మెషీన్ దగ్గరకు వెళ్లి పరిశీలించాడు. దాన్ని తట్టి చూస్తే లోపలి నుంచి సన్నగా శబ్దాలు వినిపించాయి. సన్నగా ధ్వని వస్తోందని స్పష్టం చేసిన అధికారి, వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాడు.

బ్యాంకు సిబ్బంది చేరుకుని ఏటీఎం మెషీన్‌ను తెరచి అవాక్కయ్యారు. దాని వెనుక ఓ వ్యక్తి చిక్కుకుని ఉన్నాడు. ఏటీఎం అమర్చిన సర్వీస్ రూంలో చిక్కుకున్న అతడు కాపాడాలని కోరుతూ, కరెన్సీని విత్ డ్రా చేస్తున్నపుడు డబ్బుతో పాటు 'ప్లీజ్ హెల్ప్ మీ, నా దగ్గర ఫోన్ కూడా లేదు, నా యజమానికి ఫోన్ చేయడంటూ కాగితాలపై రాసి వాటిని బయటకు పంపేవాడు. ఏటీఎం వెనుకవైపు డోర్ లాక్‌ను రిపేర్ చేయడానికి వచ్చిన అతడిని చూసుకోకుండానే, సిబ్బంది బయటకు వచ్చేశారని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఆయన ఫోన్ కూడా మరో గదిలో ఉండిపోవడంతో ఏం చేయాలో తెలియక ఇలా చేశాడు. అయితే అతడి పేరు మాత్రం పోలీసులు వెల్లడించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.