యాప్నగరం

​పిన్ని మీద కన్నేశాడు.. పలుసార్లు అత్యాచారయత్నం!

కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక యువకుడు వావీవారసలు మరిచి పిన్ని వరస

TNN 21 Jun 2017, 10:10 am
కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక యువకుడు వావీవారసలు మరిచి పిన్ని వరస అయ్యే మహిళ మీద కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లోబరుచుకోవాలని పలుసార్లు ప్రయత్నించాడు. అత్యాచారం చేయయత్నించాడు. ప్రతిసారీ ఆ కామాంధుడి నుంచి తప్పించుకున్న ఆ మహిళకు ఓర్పు నశించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కామాంధుడు కటకటాలపాలయ్యాడు. కర్ణాటక రాజధాని బెంగళూరు పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu man tried to rape his aunt
​పిన్ని మీద కన్నేశాడు.. పలుసార్లు అత్యాచారయత్నం!


పోలీసులు తెలిపిన వివరాల మేరకు... శివాజీనగర్ పరిధిలోని 27 యేళ్ల యువకుడు ఒకడు సొంత పిన్నిపై అత్యాచార యత్నం చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆ మహిళ ప్రతిఘటించడంతో పాటు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి ఆ యువకుడిని పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

అయితే అలా పిన్నిపై అత్యాచారయత్నం చేయడం వాడికి కొత్తేం కాదట. గతంలో కూడా పలుసార్లు తనపై అతడు లైంగిక దాడికి ప్రయత్నించాడని ముప్పై యేళ్ల వయసున్న ఆ మహిళ చెప్పింది. అయితే పరువు పోతుందని తను ఆ విషయాలను బయటకు చెప్పలేదని ఆమె వివరించింది. రెండు మూడు సార్లు అలా జరిగిందని, మంగళవారం అతడు మళ్లీ అలాంటి యత్నం చేయడంతో తనలో ఓర్పు నశించిందని ఆమె ఆవేదన భరితురాలైంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.