యాప్నగరం

ముస్లిం అబ్బాయితో తిరుగుతావా.. అని చితకబాదారు!

ముస్లిం అబ్బాయిని లవ్ చేస్తున్నావా..? వాడితో తిరుగుతున్నావెందుకంటూ.. ఓ అమ్మాయిని, అబ్బాయిని చితకబాదారు...

TNN 28 Oct 2017, 6:27 pm
ముస్లిం అబ్బాయితో చనువుగా ఉందనే కారణంతో ఓ హిందూ యువతిని చితకబాదారు. ఆడా మగా అనే తేడా లేకుండా పట్టపగలే ఇద్దర్నీ చితక బాదారు. ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తున్నాని చెప్పిన అమ్మాయిపై జులం చూపారు. ఆ అబ్బాయిని ఏమనొద్దని అమ్మాయి వేడుకుంటున్నా వినకుండా కొట్టారు. సోదరి లాంటిదనే కనికరం కూడా లేకుండా బస్సులోనే జుట్టు పట్టుకుని లాగారు.
Samayam Telugu men beating girl and her muslim boy friend video goes viral
ముస్లిం అబ్బాయితో తిరుగుతావా.. అని చితకబాదారు!


మీ నాన్నకు చెప్పాలా..? గట్టిగా మాట్లాడుతాన్నావేంటి? పోలీసుల్ని పిలవాలా? మీరు లేవండంటూ.. తమ కండ బలం చూపించారు. అంతే కాకుండా ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో ఉంచారు. ఈ ఘటన హర్యానాలోని కురుక్షేత్రలో చోటు చేసుకుంది. వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.