యాప్నగరం

నోట్లు చల్లుకుంటూ వెళ్లిన దుండగులు

రాజస్థాన్‌లోని చురూ సిటీ హైవేపై అర్థరాత్రి కొత్త నోట్ల వర్షం కురిసింది.

TNN 14 Dec 2016, 5:44 pm
Samayam Telugu men threw notes on churu highway in rajasthan
నోట్లు చల్లుకుంటూ వెళ్లిన దుండగులు
రాజస్థాన్‌లోని చురూ సిటీ హైవేపై అర్థరాత్రి కొత్త నోట్ల వర్షం కురిసింది. కొందరు దుండుగులు కారులోంచే కొత్త నోట్లు రోడ్డుపై చల్లుకుంటూ వెళ్లారు. అసలేం జరిగిందంటే... నలుగురు వ్యక్తులు అక్రమంగా రూ.8లక్షల కొత్త నోట్లను కారులో తరలిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి చురూ పోలీస్ స్టేషన్ కు స్థానికంగా ఉండే ఓ ఇన్‌ఫార్మర్ ఆ విషయాన్ని చెప్పాడు. ఆ కారును ఛేజ్ చేయడం మొదలుపెట్టారు. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న ఆ వ్యక్తులు కొత్త నోట్లను రోడ్డుపై చల్లుకుంటూ వెళ్లసాగారు.

పోలీసులు ఓ దాబా యజమానితో మాట్లాడి అతని వ్యానును హైవేపైకి పంపించమని అడిగారు. దాబా వ్యాన్ దుండగుల కారుకు ఎదురుగా వచ్చి వారిని వెళ్లకుండా అడ్డుకుంది. వెనుక పోలీసు వాహనం ఉండడంతో ఎటూ వెళ్లలేక కారు ఆపేశారు దుండగులు. వారిలో ఒకడు రూ.4లక్షలతో పారిపోగా మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి దగ్గర ఉన్న సొమ్ముని స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు మీద పడ్డ నోట్ల కాగితాలని ఏరారు. మొత్తం రూ.4లక్షల రూపాయలని స్వాధీనం చేసుకున్నారు.

వాటిలో లక్ష రూపాయలు రూ.2000 నోట్ల రూపంలో ఉండగా, మిగతావి రూ.100 నోట్లు. ఆ నలుగురు తమ దగ్గర ఉన్న నల్లధనన్ని కొత్త నోట్ల రూపంలో మార్చుకునేందుకు వచ్చారు. 35 శాతం కమీషన్ ఇచ్చి వారు మార్పిడి చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.