యాప్నగరం

ఆ వంతెన వద్ద సెల్ఫీ దిగిన మంత్రి

ఈ మంత్రిగారి గురించి ఏం చెప్పాలి... విషాదకర ఘటన జరిగిన ప్రాంతంలో కూడా సెల్ఫీ దిగాడు.

TNN 5 Aug 2016, 1:04 pm
ఈ మంత్రిగారి గురించి ఏం చెప్పాలి... విషాదకర ఘటన జరిగిన ప్రాంతంలో కూడా సెల్ఫీ దిగాడు. అతని వ్యవహార శైలిపై ఇప్పుడు దుమారం రేగుతోంది. పూర్తి వివరాల ప్రకారం... ముంబై-గో రహదారిలో వందల ఏళ్ల నాటి పురాతన వంతెన కూలిపోయింది. వంతెనపై ఉన్న బస్సులు, కార్లు సావిత్రి నదిలో కొట్టుకెళ్లిపోయాయి. దాదాపు 50 మంది దాకా కనిపించకుండా పోయారు. మృతదేహాలను వెలికి తీసే పనిలో ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. చనిపోయిన వారి, కనిపించకుండా పోయిన వారి బంధువుల రోదనలతో ఆ ప్రాంతం విషాదకరంగా ఉంది. బుధవారం ఆ ప్రాంతానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చారు. అతనితో పాటూ మంత్రి ప్రకాశ్ మెహతా కూడా వచ్చారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం ఆయన తన ఫోన్లో సావిత్రి నదిని బ్యాక్ గ్రౌండ్‌గా వచ్చేట్టు సెల్ఫీ తీసుకున్నాడు. ఈ విషయం తెలిసి ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అతని ప్రవర్తన బాగోలేదని విమర్శించాయి.
Samayam Telugu minister prakash mehta clicking selfie near collapsed bridge
ఆ వంతెన వద్ద సెల్ఫీ దిగిన మంత్రి


కొత్త బ్రిడ్జి పక్కన విరిగిపోయిన పాత బ్రిడ్జి....

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.