యాప్నగరం

16 ఏళ్ల బాలిక కిడ్నాప్...గ్యాంగ్ రేప్ కథ!

చిన్ననాటి పరిచయంతో ఇంటికి తీసుకొచ్చిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటమే కాదు తన స్నేహితుడితో కూడా ఆ పని చేయించాడు ఓ కామాంధుడు.

TNN 31 Jan 2017, 7:09 pm
చిన్ననాటి పరిచయంతో ఇంటికి తీసుకొచ్చిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటమే కాదు తన స్నేహితుడితో కూడా ఆ పని చేయించాడు ఓ కామాంధుడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల బాలిక సిమ్రన్ (పేరు మార్చారు)పై సుర్జీత్ సింగ్ అనే వ్యక్తి, అతడి స్నేహితుడు కలిసి కొన్ని మాసాలుగా అత్యాచారానికి పాల్పడటమే కాదు ఆమెను బ్లాక్‌మెయిల్‌ కూడా చేశారు.
Samayam Telugu minor girl tells tale of kidnap gang rape blackmail
16 ఏళ్ల బాలిక కిడ్నాప్...గ్యాంగ్ రేప్ కథ!


జనవరి 21 న స్కూల్‌కు వెళ్లిన సిమ్రాన్ తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు షహదరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా అపహరణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని షహదరా డీసీపీ నుపూర్ ప్రసాద్ తెలిపాడు. తప్పిపోవడానికి ముందు రోజు తనకు కడుపులో నొప్పిగా ఉంది, డాక్టర్‌ను కలవడానికి వెళ్తున్నట్లు సిమ్రన్ చెప్పినట్లు ఆమె తల్లి పోలీసులకు తెలిపింది.

ఈ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె గర్భవతిగా నిర్ధరించారు. అలాగే ఫగ్వార్ గ్రామం నుంచి సిమ్రన్‌ ఫోన్‌కు కాల్ వచ్చినట్లు గుర్తించారు. ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. చాలా ఏళ్ల కిందట నిందితుడు తాము కూడా పంజాబ్‌లో ఫగ్వాన్‌ గ్రామంలో నివాసం ఉన్నామని బాలిక తెలిపింది. ఆ తర్వాత తమ కుటుంబం ఢిల్లీకి వచ్చేసింది.

అయితే గత జులైలో స్కూల్ నుంచి వస్తుండగా సుర్జీత్ సింగ్ కనపడటంతో ఆశ్చర్యం కలిగిందని, చిన్నప్పుడు పరిచయంతో తమ ఇంటికి తీసుకెళ్లానని ఆమె పేర్కొంది. కానీ తను వచ్చేసరికి ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో వాళ్లు వచ్చేవరకు వేచి ఉండాలని చెప్పింది. దీని అవకాశంగా తీసుకున్న సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడటమే కాదు, ఫోటోలు తీసి వాటిని ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరించాడు.

వీటిని చూపించి తన స్నేహితుడితో కలిసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వివరించింది. ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరించాడని, తాను గర్భం దాల్చిన విషయం అతడికి తెలపడంతో ఫగ్వారాకు తీసుకుపోయి ఓ ఇంట్లో బంధించాడని అంది. నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని, అతడి స్నేహితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీసీపీ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.