యాప్నగరం

అయ్యో! కోతులు ఎంత పనిచేశాయ్..

కోతులు చేసిన చేష్టలు.. బాంబులు పేలడానికి కారణమై, పలువురు గాయపడటానికి కారణయ్యాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో జరిగింది. బాంబులు ఉన్న పాలిథిన్ కవరును కోతులు ఎత్తుకెళ్తుండగా.. అది కిందపడింది. దీంతో ఆ కవరులో ఉన్న బాంబులు పేలాయి.

Samayam Telugu 21 Jul 2018, 8:04 pm
కోతులు చేసిన చేష్టలు.. బాంబులు పేలడానికి కారణమై, పలువురు గాయపడటానికి కారణయ్యాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో జరిగింది. బాంబులు ఉన్న పాలిథిన్ కవరును కోతులు ఎత్తుకెళ్తుండగా.. అది కిందపడింది. దీంతో ఆ కవరులో ఉన్న బాంబులు పేలాయి. దీంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గులాబ్ గుప్తా (60) స్కూలుకు వెళ్లిన తన మనవడు వచ్చే సమయం కావడంతో ఐదేళ్ల తన మనవడితో కలిసి ఇంటి బయట ఎదురుచూస్తున్నాడు.
Samayam Telugu monkeys


ఈ క్రమంలో అటుగా వెళ్తున్న కోతులు నోటితో పట్టుకున్న పాలిథిన్ సంచిని వారిపై జారవిడిచాయి. అంతే పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఆ కవరులో ఉన్న బాంబులు పేలాయి. దీంతో తాతామనవళ్లతో పాటు అటుగా వెళుతున్న ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు.

కోతులు బహుశా చెత్త డంపింగ్ యార్డ్ నుంచి ఆ సంచిని తీసుకొచ్చి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. సంచితో ఇంటిపైన అవి గెంతుతుండగా పొరపాటున అది కిందపడి పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. బాధితులకు ప్రాణాపాయం లేదని, కోలుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుందని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.