యాప్నగరం

ప్రాణాలు ఆవిరైపోతున్నాయ్

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజల ప్రాణాలు గాల్లో ఆవిరైపోతున్నాయి.

TNN 15 Apr 2016, 10:49 pm
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజల ప్రాణాలు గాల్లో ఆవిరైపోతున్నాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు ఎండవేడిమి కారణంగా వడదెబ్బ పాలవుతున్నారు. ఒక్క ఒడిశా రాష్ట్రంలోనే ఇప్పటికి దగ్గర దగ్గర 40 వరకు ప్రజలు వడదెబ్బ కారణంగా అసువులు బాసారని వార్తలు వచ్చాయి. ఆ రాష్ట్రంలోని కొన్ని రీజియన్లలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతోంది. ఇదిలా ఉండగా దేశంలోని దాదాపు చాలా రాష్ట్రాల్లోనూ వడగాల్పుల హోరు పెరిగింది. సూర్యప్రతాపంతో ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పౌరులకు ఎండ వేడిమి నుండి కాపాడుకునే పద్ధతులను ప్రచారం చేస్తున్నాయి. ఆసుపత్రుల్లో వడదెబ్బ బాధితులకు కొన్ని చోట్ల ప్రత్యేకంగా పడకలు కూడా ఏర్పాటుచేసారు. ఎండల నేపథ్యంలో రోజువారీ కూలీపనులు చేసుకునే వారి పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. మిట్టమధ్యాహ్నం పనుల వల్ల అత్యధికంగా వీరే వడదెబ్బ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల మధ్యాహ్నపు పనివేళలను మార్పులు చేసారు. కూలీలకు మధ్యాహ్నం వేళల్లో కాస్త విరామం ఇవ్వాలని స్థానిక సంస్థలు సూచిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు ప్రజల గుండెపై కూడా దుష్ప్రభావం కనబరుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండ దెబ్బ కారణంగా చనిపోయే వారి మరణాల్లో చాలావరకు గుండెపోటే కారణంగా చెపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.