యాప్నగరం

వీడియో వైరల్: 2 గంటలకు పైగా నిలిచిపోయిన పాక్ విమానం.. చంటిబిడ్డ తల్లి ఏడుపు

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) క్యాబిన్ సిబ్బంది వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది.

Samayam Telugu 8 Aug 2018, 8:03 pm
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) క్యాబిన్ సిబ్బంది వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. విమానం టేకాఫ్ కావడానికి ముందు ప్రయాణికులను గంటల తరబడి విమానంలో నిర్బంధించి, చంటి పిల్లాడికి ఊపిరాడకుండా చేసిన సిబ్బందిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పైలట్లను విమానం డోర్ తెరవాలని ఏడుస్తూ ప్రాధేయపడిన ఓ చంటిపిల్లాడి తల్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పీఐఏ స్పందించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు పీఐఏ సీఈవో డాక్టర్ ముషారఫ్ రసూల్ సియాన్ ఆదేశించారు.
Samayam Telugu PIA


టైమ్స్ ఆఫ్ కరాచీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ వీడియో ఆధారంగా.. పారిస్ నుంచి ఇస్లామాబాద్‌కు వస్తోన్న పాకిస్థాన్ ప్రభుత్వ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ ఘటన జరిగింది. ‘పీకే 750 విమానం ఆగస్టు 3న రాత్రి 9 గంటలకు పారిస్ నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరాల్సి ఉంది. అయితే ప్రయాణికులు విమానంలో ఉండగానే ఎలాంటి కారణం చెప్పకుండా 2 గంటల 39 నిమిషాలు ఆలస్యం చేశారు’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. చంటి పిల్లాడి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని వెల్లడించారు.
ఈ 2 గంటల 39 నిమిషాల పాటు ప్రయాణికులు గాలి ఆడక ఇబ్బంది పడ్డారు. తన చంటి పిల్లాడు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాడని, డోర్ తెరవాలని ఓ మహిళ పైలట్లను విలపిస్తూ కోరినా వారు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు తప్ప డోర్ తెరవలేదు. అయితే దీనిపై విచారణకు ఆదేశించినట్లు సీఈవో పేరిట పీఐఏ ట్విట్టర్‌లో ప్రెస్ స్టేట్‌మెంట్‌ను ఉంచింది. మరోవైపు ఫేస్‌బుక్‌లో వీడియో చూసిన నెటిజన్లు పీఐఏను ఏకిపారేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.