యాప్నగరం

ఊహాచిత్రం... ఓ జీవితం నాశనం

జిషా అనే అమ్మాయి కేరళలో ఘోర హత్యకు గురైంది.

TNN 8 Jun 2016, 3:11 pm
జిషా అనే అమ్మాయి కేరళలో ఘోర హత్యకు గురైంది. ఆమెను చంపిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ఓ ఊహాచిత్రాన్ని గీయించి విడుదల చేశారు. ఆ ఊహాచిత్రం మరో యువకుడి జీవితంతో ఆడుకుంది. చేయని తప్పుకు నిందలు మోసేలా చేసింది. ఎలాగో చదవండి. పెరువూరులోని ఓ వస్త్రదుకాణంలో సేల్స్ మ్యాన్ గా చేస్తున్నాడు తాస్లిక్. అమ్మానాన్న, భార్య, పిల్లలను పోషించాల్సిన బాధ్యత తనదే. ఎప్పటికైనా సినిమాల్లో చేయాలన్నది తన కోరిక. అందుకోసం ఫేస్ బుక్ లో రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీయించుకుని పెడుతుంటాడు. కాగా జిషా అనే అమ్మాయి హత్య కేసులో పోలీసులు గీయించిన ఊహాచిత్రాన్ని కూడా ఫేస్ బుక్ లో పెట్టారు. దానిని వేలల్లో నెటిజన్లు షేర్ చేశారు. ఆ ఊహాచిత్రానికి కాస్త తాస్లిక్ పోలికలున్నాయి. ఇంకేముంది కొందరు నెటిజన్లు తాస్లిక్ ఫోటో, ఊహాచిత్రంతో పోలుస్తూ కామెంట్లు పెట్టారు. రెండు ఫోటోలను షేర్ చేశారు. చేయని తప్పుకు హత్యానేరం మీదపడే అవకాశం ఉందని భావించి తాస్లిక్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. మొత్తం వివరించి తనకు ఏం సంబంధం లేదని చెప్పాడు. పోలీసులు అతడిని వదిలేశారు. కానీ అతనికి రాకరాక వచ్చిన సినిమా అవకాశం పోయింది. అంతేనా అందరూ నిందితుడిలా అతడిని చూడసాాగారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనలా ఎవరి జీవితాలతోనూ ఆడుకోవద్దంటూ ఫేస్ బుక్ ద్వారా నెటిజన్లను కోరాడు.
Samayam Telugu murder suspect sketch shattered this youg mans life and dreams
ఊహాచిత్రం... ఓ జీవితం నాశనం






Malayalam Story link:

http://malayalam.samayam.com/social/jisha-murder-sketch-put-innocent-youth-in-dilemma/articleshow/52651458.cms

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.