యాప్నగరం

హిందూ గీతం పాడిన ముస్లిం యువతికి బెదిరింపులు!

ఓ టీవీ రియాల్టీ షోలో హిందూ మతం గీతాన్ని ఎంపిక చేసుకుని పాడిన ముస్లిం యువతికి మత ఛాందసవాదుల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి.

TNN 9 Mar 2017, 5:41 pm
కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల ముస్లిం యువతి సుహానా సయ్యద్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. జీ కన్నడ సరిగమప రియాల్టీ షోలో హిందూ మతం గీతాన్ని ఎంపిక చేసుకుని పాడి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ముస్లిం సంప్రదాయానికి చెందిన మహిళ హిందూ భక్తి గీతాన్ని 100 సెకెన్లు పాటు ఆలపించడంతో న్యాయ నిర్ణేతలే ఆవాక్కయ్యారు.
Samayam Telugu muslim girl threatened by radical islamists for singing a devotional hindu song
హిందూ గీతం పాడిన ముస్లిం యువతికి బెదిరింపులు!


హిందూ మతం భక్తి గీతం పాడిన మీరు ఐక్యత చిహ్నంగా మారారు... సంగీతం అనేది ప్రజల మధ్య అదృశ్యంగా ఉన్న అంతరాలు, తేడాలను తగ్గించే ఒక మాధ్యమంలా పనిచేస్తుందని ఓ న్యాయ నిర్ణేత ఆమెను అభినందించారు. అయితే దీన్ని మాత్రం ఇస్లాంలోని ఛాందసవాదులు తప్పుబడుతున్నారు. హిందూ మతం గీతాన్ని ఎంపిక చేసుకోవడమే కాదు, మగాళ్ల ముందు పాడటం ఏంటని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మంగళూరు ముస్లిం గ్రూప్ పేరుతో ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు.

బుర్ఖాను గౌరవించని నీవు దాన్ని వేసుకునే అర్హత కోల్పోయావంటూ సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేశారు. పరాయి పురుషుల ముందు నీ అందాన్ని చూపడానికి మీ తల్లిదండ్రులు ప్రోత్సహించారని, ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు స్వర్గానికి చేరుకోలేవంటూ రాశారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుహానా‌ను మాత్రం చాలా మంది అభినందిస్తున్నారు. అంతేకాదు సంగీతం ద్వారా సుహానా వివిధ మతాల మధ్య సమైక్యతను చాటిచెప్పారని కొనియాడుతున్నారు.

ఆమెను బెదిరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫేస్‌బుక్‌లో వ్యతిరేక వ్యాఖ్యలు చేసినవారిపై సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం ఇప్పటికే చర్యలకు ఉప్రకమించమాని కర్ణాటక ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్ మంత్రి యూటీ ఖదేర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.