యాప్నగరం

హిందూ యువకునికి ముస్లిం సోదరుల అంత్యక్రియలు

భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే దేశం మనది. హిందూ ముస్లింలు ఇద్దరూ సహోదరుల్లా కలిసి జీవిస్తున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి.

TNN 26 Apr 2017, 3:09 pm
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే దేశం మనది. హిందూ ముస్లింలు ఇద్దరూ సహోదరుల్లా కలిసి జీవిస్తున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ గ్రామంలో ముస్లిం సోదరులు చనిపోయిన హిందూ యువకుడికి పూర్తిగా హిందూ సాంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహించి గొప్పతనాన్ని చాటుకున్నారు. పలు చోట్ల ముస్లిం సోదరులపై ఆవుల సంరక్షకుల పేరిట దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అది నాణానికి ఒక వైపు మాత్రమే... మరో వైపు కలిసి మెలిసి జీవిస్తున్న ముస్లిం-హిందూ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.
Samayam Telugu muslim men arranged for the cremation of a hindu youth in maldah
హిందూ యువకునికి ముస్లిం సోదరుల అంత్యక్రియలు


పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని షేక్ పురా గ్రామంలో అన్ని ముస్లిం కుటుంబాలే నివసిస్తున్నాయి. వారి మధ్య రెండు మూడు హిందూ కుటుంబాలు ఉన్నాయి. వారంతా హిందూ కుటుంబాలతో కలిసి మెలిసి ఉంటారు. కాగా బిస్విజిత్ అనే హిందూ యువకుడు మరణించాడు. అతని తల్లిదండ్రులు చాలా పేదవారు. కనీసం అంత్యక్రియలు కూడా నిర్వహించడానికి వారి దగ్గర డబ్బుల్లేవ్. దీంతో రాత్రంతా శవాన్ని ఎదురుగా పెట్టుకుని కూర్చున్నారు. వారి బాధని అర్థం చేసుకున్న ముస్లిం కుటుంబాలు మరుసటి నాడు ఉదయమే ఇంటికి వచ్చి సాయం చేస్తామని చెప్పారు.

ఒక కట్టెల మంచంపై బిస్వజిత్ మృతదేహాన్ని పెట్టి... గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానానికి తీసుకెళ్లారు. ఆ దారంతా హిందూ మంత్రాలు జపించారు. ‘బోలో హరి, హరి బోలో’ అని జపిస్తూ వెళ్లారు. హిందూ పద్ధతిలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. వారి సోదర భావం ఊరినే కదిలించింది. ఒక ముస్లిం యువకుడు మాట్లాడుతూ భారతావనికి హిందూ, ముస్లింలు ఇద్దరు కొడుకులని అన్నారు. ముందు మనం మనుషులమని తరువాతే మతాలని చెప్పారు. మతం పేరుతో చిచ్చుపెట్టే నాయకులకు ఈ గ్రామ ప్రజలు ఆదర్శనీయం.

Read this story in bengali

http://eisamay.indiatimes.com/state/man-died-due-to-financial-trouble-muslim-friends-comes-help-for-his-cremation/articleshow/58372409.cms

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.